Breaking News

శ్రావణ మాసం వచ్చేస్తోంది..! మంచి ముహూర్తాలు ఎప్పుడంటే..

Published on Mon, 07/21/2025 - 05:04

సాక్షి, అమలాపురం: శుభకార్యాలకు నెలవైన శ్రావణ మాసం వచ్చేస్తోంది. ఈనెల 25 నుంచి ఆరంభం కాబో­తోంది. ముహూర్తాలు కూడా బాగా ఉండడంతో ఈసారి పెళ్లిబాజాలు ఘనంగా మోగనున్నాయి. ఎక్కడి­కక్కడ అమ్మవారి ఆలయాలను సైతం ముస్తాబు చేస్తు­న్నారు. మహిళలు పూజలకు సిద్ధమవుతున్నారు. ఆషా­డం వీడి శ్రావణం మొదలుకానుండడంతో వ్యాపారు­లు, రైతులు మార్కెట్‌పై కొత్త ఆశలు పెట్టుకున్నారు. 

ఈ సీజన్‌లో వస్త్రాలు, పూలు, పండ్లు, స్వీట్లు, బంగారం, వెండి వస్తువులకు డిమాండ్‌ పెరగనుంది. వచ్చే శుక్రవారం నుంచే శ్రావణమాసం మొదలుకానుండడంతో శుభ ముహూర్తాల సీజన్‌ మొదలవుతుంది. నవంబరు వరకూ ఈ సుముహూర్తాల సీజన్‌ కొనసాగనుంది. ఇక ఈసారి భాద్రపద మాసం మినహా శ్రావణ మాసం మొదలు నవంబరు వరకు ప్రతినెలా ముహూర్తాలు ఉండటం విశేషం. 

ముహూర్తాల తేదీలు ఇవే..
ఈ నెలలో 26, 30, 31 తేదీల్లోను, ఆగస్టులో 1, 3, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17 తేదీల్లో ముహూర్తాలు­న్నాయి. అలాగే, ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 21 వరకూ భాద్రపద మాసం. ఇది శూన్యమాసం కావడంతో ముహూర్తాలు లేవు. ఆ తర్వాత సెప్టెంబరులో 23 నుంచి ప్రారంభమై 24, 26, 27, 28 తేదీల్లో.. అనంతరం అక్టోబరు, నవంబరు నెలల్లో కూడా ముహూర్తాలు రికార్డు స్థాయిలో ఉన్నాయి.

ఈ మాసాల్లో ఏకంగా 13 రోజుల చొప్పున శుభ ముహూర్తాలు ఉండటం విశేషం. అక్టోబరులో 1, 2, 3, 4, 8, 10, 11, 12, 22, 24, 29, 30, 31 తేదీలు.. నవంబరులో 1, 2, 7, 8, 12, 13, 15, 22, 23, 26, 27, 29, 30 తేదీల్లో శుభ ఘడియలున్నాయి. అనంతరం.. డిసెంబరు 8 నుంచి ఫిబ్రవరి ఆరో తేదీ వరకూ ఇంచుమించు రెండు నెలలపాటు ముహూర్తాలు లేవు.

పురోహితులు, వ్యాపారుల్లో ఆశలు..
ఈ సంవత్సరం జూన్‌ 10 నుంచి ఈనెల 8 వరకూ గురు మౌఢ్యమి కావడంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ప్రారంభోత్సవాల వంటి ముహూర్తాల్లేవు. ఈనెల 31న పెద్ద ముహూర్తం కావడంతో పెళ్లిళ్లు పెద్ద సంఖ్యలో జరగనున్నాయి. గత రెండునెలలుగా శుభ కార్యక్రమాల్లేక ఇబ్బందిపడుతున్న పురోహితులతో పాటు వారికి అనుబంధంగా ఉపాధి పొందేవారికీ రానున్న కాలం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)