Breaking News

ప్రత్యేక రైళ్లు పొడిగింపు

Published on Wed, 06/18/2025 - 02:53

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల డిమాండ్‌ మేరకు చర్లపల్లి–నర్సాపూర్, జాల్నా–తిరుపతి మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్‌ పీఆర్‌వో నుస్రత్‌ మండ్రూప్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి–నర్సాపూర్‌ (07233) ప్రత్యేక రైలు జూలై 5 నుంచి వచ్చే ఏడాది మార్చి 28 వరకు ప్రతి శనివారం రాత్రి 7.50 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7 గం.లకు నర్సాపూర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (07234) జూలై 6 నుంచి వచ్చే ఏడాది మార్చి 29 వరకు ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. 

రెండు మార్గాల్లో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లు స్టేషన్‌లలో ఆగుతుంది. ఇక జాల్నా–తిరుపతి (07609) రైలు జూలై 7 నుంచి వచ్చే ఏడాది మార్చి 30 వరకు ప్రతి సోమవారం ఉదయం 7 గంటలకు జాల్నాలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 

తిరుగు ప్రయాణంలో (07610) జూలై 8 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3.50 గంటలకు జాల్నా చేరుకుంటుంది. ఈ రైలు బీదర్, మారపల్లి, వికారాబాద్, లింగంపల్లి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్‌లలో ఆగుతుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)