Breaking News

ఏపీలో ‘ఉగ్ర’ కలకలం.. వెలుగులోకి సంచలన విషయాలు

Published on Sun, 08/17/2025 - 14:05

సాక్షి, అనంతపురం: శ్రీసత్యసాయి జిల్లా చెందిన ఓ వంట మనిషికి పాకిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉండటం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన సమాచారం ఆధారంగా ధర్మవరం పట్టణానికి చెందిన నూర్ మహ్మద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బయటకు సాధారణ జీవితం గడుపుతూ.. లోపల మాత్రం పాకిస్థాన్ ఉగ్రవాదులతో కలిసి పనిచేసిన వైనం తీవ్ర సంచలనం గా మారింది.

ధర్మవరం పట్టణానికి చెందిన నూర్ మహ్మద్‌ లోనికోట ఏరియాలో నివసిస్తున్నారు. ఓ హోటల్లో వంట మనిషిగా... టీ చేసే వ్యక్తిగా సాధారణ జీవితం గడుపుతున్నారు. చాలీచాలని జీతంతో అప్పులు చేసిన ఇతను... కొంత కాలం క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు. తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహామైన నూర్ మహ్మద్‌కు నలుగురు పిల్లలు ఉన్నారు. భార్యతో విభేదాలు రావడంతో విడిగా ఉంటున్నారు నూర్ మహ్మద్. తాడిపత్రికి చెందిన ఓ మహిళతో నూర్ మహ్మద్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.

నూర్ మహ్మద్ అరెస్ట్ తర్వాత తాడిపత్రికి చెందిన మహిళ అదృశ్యం అయ్యింది. ఆమెకు కూడా ఉగ్ర లింకులు ఉన్నాయా? ఆమె ద్వారానే నూర్ మహ్మద్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పడ్డాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ధర్మవరం ఉగ్రవాది నూర్ మహ్మద్ ఇంట్లో జిహాద్ పుస్తకాలు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న మీడియాకు వివరాలు వెల్లడించారు.

అరెస్ట్ అయిన నూర్ మహ్మద్‌పై దేశ ద్రోహం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కదిరి కోర్టులో హాజరు పరిచారు. నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది కదిరి కోర్టు. ఎన్ఐఏ, కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో సహకారంతో పూర్తి స్థాయిలో ధర్మవరం పోలీసులు విచారణ చేస్తున్నారు. ధర్మవరంలో నూర్‌ మహమ్మద్‌తో పాటు మరో వ్యక్తిని ఉపా చట్టం కింద అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ రత్న వెల్లడించారు. వీరిద్దరూ నిషేధిత వాట్సప్‌ గ్రూపుల్లో సమాచారం షేర్‌ చేసినట్లు గుర్తించినట్లు ఆమె తెలిపారు.

నిందితులను అరెస్టు చేసి కడప జైలుకు తరలించామని.. పాక్‌కు చెందిన వాట్సప్‌ గ్రూపుల్లో నిందితుడు సభ్యుడిగా ఉన్నాడని ఎస్పీ పేర్కొన్నారు. కస్టడీలోకి తీసుకొని లోతుగా విచారిస్తామని ఎస్పీ తెలిపారు. నిషేధిత వాట్సప్‌ గ్రూప్‌లు 6, పాక్‌కు చెందిన మరో 30 గ్రూపుల్లో నూర్ మహ్మద్‌ సభ్యుడిగా ఉన్నాడు’’ అని ఎస్పీ రత్న మీడియాకు వివరించారు.

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)