Breaking News

నేడు రాష్ట్రానికి ‘నైరుతి’ ఆగమనం

Published on Mon, 05/26/2025 - 06:03

సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు సోమ­వారం రాష్ట్రాన్ని తాకనున్నాయి. కేరళ రాష్ట్రాన్ని శుక్రవారం రాత్రి తాకిన ఈ రుతుపవనాలు శని, ఆదివారాల్లో కర్ణాటక వ్యాప్తంగా విస్తరించాయి. అక్కడ నుంచి దాదాపు రాయలసీమకు అతిచేరు­వలోకి సమీపించగా, మన రాష్ట్రంలోకి సోమ­వారం ప్రవేశించనున్నాయి. దీంతో ఈ ఏడాది వారం రోజులు ముందే నైరుతి రుతుప­వనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. వారంలో రాష్ట్రవ్యాప్తంగా విస్త­రించే అవకాశాలు­న్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 

రేపు అల్పపీడనం..
మరోవైపు.. తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి∙ఉత్తర ఒడిశా వరకు, మధ్య మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ మీదుగా ఒక ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 నుంచి 4.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇది 27వ తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశమున్నట్లు వాతా­వరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశ­ముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

అలాగే, సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ­, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు­గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్న­మయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఆ సంస్థ పేర్కొంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)