Breaking News

‘నైరుతి’ వచ్చేసింది

Published on Mon, 06/03/2024 - 05:20

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/యడ్లపాడు/: నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలోకి ముందుగానే ప్రవేశించాయి. ఇవి శనివారం రాత్రి రాయలసీమను తాకినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో రెండ్రోజుల్లో అవి రాష్ట్రమంతా శరవే­గంగా విస్తరించే అవకాశమున్నట్లు స్పష్టంచేసింది. సాధారణంగా రుతు పవనాలు ఐదో తేదీ తర్వాత రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ముందుగానే ప్రవే­శిం­చాయి. దీంతో రాయలసీమలోని అనంతపురం, అనంతరం నెల్లూరు జిల్లాను తాకడంతో ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తు­న్నాయి.

ఇవి ఒకట్రెండు రోజుల్లో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాల్లోకి విస్తరించనున్నాయి. నైరుతి రుతుపవనాలు దూకుడుగా ఉన్నందున రెండు మూడ్రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతా­వరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. అలాగే, పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖా­తాల్లోకి కూడా ఇవి వ్యాపించనున్నట్లు తెలిపింది. ఈ రుతు పవనాలు మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్, కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలకు విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది.

మరోవైపు.. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో పలు­చోట్ల తేలికపాటి వర్షాలు పడుతు­న్నాయి. ఇక వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో శని­వారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురి­సింది. వైఎస్సార్‌ జిల్లా సిద్దవటంలో అత్యధికంగా 30.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే, అన్నమయ్య జిల్లాల్లోని రాయచోటి, రాజంపేట, కోడూరు, తంబళ్లపల్లి, పీలేరు, మదనపల్లె నియోజ­కవర్గాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. 

నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సోమవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు–గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్‌ కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించింది. ఆదివారం సా.5 గంటల నాటికి తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 53.7 మిల్లీమీటర్లు, కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 47.7, చిత్తూరు జిల్లా పుంగనూరులో  33, కాకినాడ జిల్లా గండేపల్లిలో 23.2, అల్లూరి జిల్లా అనంతగిరిలో 22, కాకినాడ జిల్లా పెదపూడిలో 20.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

పిడుగుపాటుకు నలుగురు మృత్యువాత..
ఆదివారం కురిసిన వర్షాల్లో పిడుగులు పడి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు మత్స్యకారులు.. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో ఇద్దరు రైతులు మృత్యువాత పడ్డారు. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో పడవలో ఉన్న దుమ్ము పోలిరాజు అనే యువకుడు పిడుగు పడి అక్కడికక్కడే మరణించగా.. పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో బోటు తనిఖీకి వెళ్లిన కంబాల ముత్యాలు అనే మరో మత్స్యకారుడు కూడా పిడుగుపడి చనిపోయాడు. ఆదివారం ఉదయం ఉమ్మడి విశాఖ జిల్లాలో గంటకు పైగా ఉరుములు, మెరుపులు, పిడుగులు జనాన్ని భయకంపితులను చేశాయి.

మరోవైపు.. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో ఇద్దరు రైతులు కూడా పిడుగులకు బలయ్యారు. పొలాల్ని సాగుకు సిద్ధంచేసుకోవాలని వెళ్లిన పెద్ది చినవీరయ్య (58), చిరుతల శ్రీనివాస­రావు (51)   పిడుగుపాటుకు గురై మృతిచెందారు. ఉ.5.30 గంటల ప్రాంతంలో పొలానికి వెళ్లిన వీరు అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభమైంది. దీంతో సమీపంలోని వేప చెట్టు కిందకు వెళ్లగా అప్పుడే పెద్ద శబ్దంతో అదే  చెట్టుపై పిడుగు పడింది. ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)