Breaking News

మద్యం మత్తు.. తండ్రి చేతిలో తనయుడి హత్య

Published on Sat, 07/18/2026 - 04:53

కోనేరు సెంటర్‌: మద్యం మత్తు­లో ఉన్న తండ్రీకొడుకులు గొడ­వ పడగా..ఆగ్రహంతో కుమారుడిని తండ్రి హత్య చేశాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..బందరు మండలం బోట్లవానిపాలెంకు చెందిన బొల్లా రామ్మోహనరావు తాపీ పని, అతడి పెద్ద కుమారుడు కళ్యాణ్‌ చక్రవర్తి (30) పెయింటింగ్‌ పని చేస్తుంటారు. నాలుగేళ్ల క్రితం కళ్యాణ్‌కు గూడూరు మండలానికి చెందిన దుర్గాభవానితో వివాహం కాగా, తన భార్యతో పాటు అతడు తన అత్తవారి ఊర్లో ఉంటున్నాడు. మంగినపూడి బీచ్‌కి సమీ­పంలో పెయింటింగ్‌ పను­ల­కు వచ్చిన కళ్యాణ్‌..రెండు రోజులు­గా తల్లిదండ్రుల వద్దే ఉన్నాడు. గురువారం రాత్రి తండ్రీకొడుకులు మద్యం తాగారు. అనంతరం కళ్యాణ్‌ తన తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. 

ఈ క్రమంలో తండ్రీ
కొడుకులు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుకున్నారు. ఓ దశలో తీవ్ర ఆగ్రహంతో తండ్రి రామ్మోహనరావు మంచంపై పడుకుని ఉన్న కళ్యాణ్‌ తలపై సరుగుడు బాదుతో బలంగా కొట్టగా తలకు గాయాలై కళ్యాణ్‌ స్పృహ కోల్పోయాడు. తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో బంధువులు అతడిని మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు ఆసుపత్రికి వచ్చి ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. మృతుని భార్య దుర్గాభవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)