Breaking News

సోలో ట్రిప్‌కే అతివల ఆసక్తి

Published on Wed, 03/05/2025 - 03:39

సాక్షి, అమరావతి: పర్యాటకుల అభిరుచి కొత్త పుంతలు తొక్కుతోంది. వర్తమాన జీవితంలో సంతోషానికే ప్రాధాన్యత పెరుగు­తోంది. ఈ క్రమంలోనే 2025 సంవత్సరం మహిళల సోలో ప్రయాణాలకు కేరాఫ్‌గా మారనుంది. దీనికితోడు వెల్నెస్‌ రిట్రీట్‌లు, పాప్‌ సంస్కృతి ప్రేరేపిత టూర్లపై ఆసక్తి కనిపిస్తోంది. వీసా ప్రాసెసింగ్‌ ప్లాట్‌ఫామ్‌ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. ఈ ఏడాది అత్యంత ముఖ్యమైన ట్రెండ్‌లలో ‘సోలోగా మహిళా ప్రయాణం’ ఒకటిగా నిలుస్తోంది. 

2024లో సోలో వీసాలకు దర­ఖాస్తు చేసిన మహిళలు 30 శాతం ఉంటే.. ఈ ఏడాది 37 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తోంది. సుమారు 25–40 ఏళ్ల మధ్య మహిళలు సోలో ట్రిప్‌లను ఉద్యమంగా చేపట్టబోతు­న్నట్టు నివేదిక స్పష్టం చేసింది. బాలి, థాయ్‌లాండ్, జపాన్‌ వంటి గమ్యస్థా­నా­లలో సాహస యాత్రల ద్వారా తమ అన్వేషణను చేపట్టాలని భావిస్తున్నట్టు తేలింది.

పర్యాటక శక్తి కేంద్రంగా ఆసియా
ప్రపంచ ప్రయాణ రంగంలో ఆసియా ఆధిపత్యం కొనసాగు­తోంది. థాయ్‌లాండ్, జపాన్, వియత్నాంతో పాటు ఇండోనే­షియా 2025లో అత్యంత పర్యాటక రద్దీని ఎదుర్కోనుంది. వీసా రహిత విధానాలు, వివిధ ఎక్స్‌పోలు లక్షలాది మంది సందర్శకులను ఆకర్షించనుంది. సింగపూర్‌కు చెందిన డిస్నీ క్రూయిజ్‌కు 27 శాతానికిపైగా డిమాండ్‌ పెరగనుంది. 

నోరూరించ రుచుల కోసం
ప్రయాణ ప్రణాళికలో ఆహారం ప్రధాన భాగంగా మారుతోంది. 2025లో వంటకాల పర్యాటకం గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఇటలీ ట్రఫుల్‌ ఫెస్టివల్, థాయ్‌లాండ్‌ సాంగ్‌క్రాన్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ వంటి ఐకానిక్‌ ఈవెంట్లు ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నాయి. అదే సమయంలో స్లోవేనియా, లావోస్, ఫారో దీవులు వంటి ఆఫ్‌బీట్‌ గమ్యస్థానాలు సాహస యాత్రల అనుభవాలను మహిళలు కోరుకుంటున్నారు.

ఆరోగ్యకర ప్రయాణం
ప్రయాణికులు తమ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. బాలి, తైవాన్‌ వంటి ప్రశాంతమైన గమ్యస్థానాలలో యోగా, ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కువ ప్రాంతాలను చుట్టిరావడం కంటే ఒకే ప్రాంతంలో అనుభూతులను పూర్తిగా ఆస్వాదించేలా ‘స్లో ట్రావెలింగ్‌’ భావనను అలవర్చుకుంటున్నారు. 

మరోవైపు పాప్‌ సంస్కృతి ప్రయాణాన్ని ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా ఇష్టపడుతున్నారు. అభిమానులు తమకు ఇష్టమైన సినిమాలు, ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాల నుంచి ప్రేరణ పొంది టూర్లను ప్లాన్‌ చేసుకుంటున్నారు.   

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)