సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల పేరిట టోకరా

Published on Mon, 10/28/2024 - 04:22

గుంటూరు:  సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలంటూ ‘డెవలప్‌ ట్రీస్‌ డీఎస్‌ఆర్‌ ఐటీ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అనే సంస్థ ఫేస్‌బుక్‌ ద్వారా ప్రచారం హోరెత్తించింది. భారీ వార్షికాదాయం చెల్లిస్తామని, ఉద్యోగ భద్రత, పీఎఫ్, బీమా ఇతరత్రా సౌక­ర్యాలు కలి్పస్తామని నిరుద్యోగులకు ఆ సంస్థ ఎర వేసింది. ఏపీ, తెలంగాణతోపాటు పాండిచ్చేరి, కన్యాకుమారి, బెంగళూరు, తమిళనాడు, మహారాష్ట్ర నిరుద్యోగులు ఆ ప్రకటనకు ఆకర్షితుల­య్యారు.

సుమారు 600 మంది రూ.లక్షల్లో డిపాజిట్‌ చెల్లించి ఉద్యోగాల్లో చేరారు. ఎవరికీ జీతాలు, పీఎఫ్‌ చెల్లింపులు లేకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం ప్రకారం.. గుంటూరు అమరావతి రోడ్డులో ఆ ప్రైవేట్‌ కంపెనీని 2021లో స్థాపించారు. ఫేస్‌బుక్‌ ద్వారా నిరుద్యోగులను ఆకర్షించారు. దాదాపు 600 మంది చేరగా.. 100 నుంచి 150 మంది గుంటూరులోని కార్యాలయంలో విధులు నిర్వర్తించేవారు. పొరుగు రాష్ట్రాల్లో వారు వర్క్‌ఫ్రమ్‌ హోం చేసే వారున్నారు.  

భారీగా వసూళ్లు 
ఆ సంస్థ ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేసింది. ఆ తరువాత ఉద్యోగంలో చేరిన వారికి కష్టాలు మొదలయ్యాయి. జీతం అడిగితే ట్రైనింగ్‌ అంటూ దాటవేసేవారు. గట్టిగా అడిగితే బూతులు తిట్టేవారు. మహిళలతో అసభ్యంగా మాట్లాడేవారు. 3 నెలల శిక్షణ అనంతరం నెలకు రూ.40 వేల జీతం, వార్షిక ఆదాయం రూ.6 లక్షలు చెల్లిస్తామని చెప్పేవారు.  

పురందేశ్వరి, పెమ్మసాని బంధువులంటూ.. 
తమకు బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పిన్ని వరుస అని, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ బంధువని నిర్వాహకులు చెప్పుకునేవారు. పోలీస్‌ ఉన్నతాధికారులు బాగా తెలుసునని, హైదరాబాద్‌లో ఓ రౌడీïÙటర్‌ పేరు కూడా చెప్పి బెదిరించేవారని బాధిత ఉద్యోగులు తెలిపారు. ఈ విషయాన్ని బాధితులు గుంటూరు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా.. అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమో­దు చేశారని గుంటూరుకు చెందిన షేక్‌.రసూల్‌ తెలిపారు.

తాము డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను కలవగా.. రాజోలు ఎమ్మెల్యేతో మాట్లాడించారని చెప్పారు. ఆ తరువాత ఎమ్మెల్యే గళ్లా మాధవికి విన్నవించామని తెలిపారు. తమకు న్యాయం జరుగుతుందనే ఆశలేదని బాధితులు సీహెచ్‌.సాయి (విజయనగరం), జగదీ‹Ù, ఝాన్సీ (శ్రీకాకుళం), హేమంత్, మహేందర్‌ (తెలంగాణ) వాపోయారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)