సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ కృష్ణవేణి అరెస్ట్‌

Published on Fri, 04/18/2025 - 03:04

దాచేపల్లి: రెడ్‌బుక్‌ రాజ్యాంగ­ం మేరకు పెట్టిన అక్రమ కేసుల్లో భాగంగా సోషల్‌ మీడి­యా యాక్టివిస్ట్‌ పాలేటి కృష్ణవేణిని పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమె చేసిన ఓ సోషల్‌ మీడియా పోస్టుపై నడికుడికి చెందిన టీడీపీ నేత చిలుమూల దుర్గారావు మార్చి 1న చేసిన ఫిర్యాదు మేరకు ఆమెను అరెస్ట్‌ చేసినట్లు సీఐ భాస్కరరావు తెలిపారు. కృష్ణవేణిని బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అక్క­డి నుంచి దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పలు పత్రాలపై కృష్ణవేణితో సంతకాలు చేయించుకున్న­ట్లు తెలిసింది.

రాత్రంతా ఆమెను దాచేపల్లి పోలీ­స్‌­­స్టేషన్‌లోనే ఉంచారు. గురువారం సాయంత్రం అరె­స్ట్‌ చూపి.. గురజాల ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీ­క్షలు చేయించారు. అనంతరం గురజాల కోర్టు­లో హాజరుపరచగా ఆమెకు న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. కాగా, కృష్ణవేణిని వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షురాలు, న్యాయవాది రొళ్ల మాధవి పరామర్శించారు. 

కృష్ణవేణి అరెస్టు విష­యం తెలియడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు కోట కృష్ణ, షేక్‌ సుభానీ, కందుల జాను, తండా అబ్దుల్‌సత్తార్, మందపాటి రమేశ్‌రెడ్డి, కొప్పుల సాంబయ్య, షేక్‌ జాకీర్‌ హుస్సేన్, కుందురు తిరు­పతిరెడ్డి, షేక్‌ ఇ­మా­మ్‌వలి తదితరులు పోలీస్‌స్టేషన్‌ వద్దకు వచ్చా­రు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)