Breaking News

పారదర్శకంగా స్మార్ట్‌ మీటర్ల టెండర్లు

Published on Sun, 08/13/2023 - 04:48

సాక్షి, అమరావతి: వ్యవసాయ బోర్లకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు టెండర్ల ప్రక్రియ అంతా పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగిందని ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఐ.పృథ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి,  కె.సంతోషరావు తెలిపారు. మీటర్ల ధర ఇతర రాష్ట్రాలకంటే మన రాష్ట్రంలో ఎక్కువగా ఉందని, టెండర్లలో అవకతవకలు ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగా కొందరికి టెండర్లు కట్టబెట్టారని, ఈ ఖర్చంతా ట్రూ అప్‌ చార్జీల పేరుతో ప్రజలపైనే వేస్తారని పచ్చ పత్రికలు, విపక్షాలు చేస్తున్న తప్పు డు ప్రచారంపై వారు స్పందించారు.

వారు శని వా రం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. టెండర్లలో ఎటువంటి దాపరికం లేదని స్పష్టంచేశారు. నిబంధనల ప్రకా రం జ్యుడిషియల్‌ ప్రివ్యూ కమిషన్‌ అనుమతి తీసుకొన్న తరువాత ఏపీ ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ పో ర్టల్‌ ద్వారా టెండర్లను ఆహ్వానించామని చెప్పారు. దే శంలోని ప్రతి గుత్తేదారు పాల్గొనేలా టెండర్ల ప్రక్రి య పారదర్శకంగా నిర్వహించామని స్పష్టం చేశా రు. వారు వెల్లడించిన వివరాలు వారి మాటల్లోనే..

స్మార్ట్‌ మీటర్ల టెండర్లలో షిరిడీ సాయి, అదానీ సంస్థలు పాల్గొనగా షిరిడీ సాయి ఎల్‌ 1 గా నిలిచింది. అనుబంధ పరికరాల టెండర్లలో షిరిడీ సాయి, జీవీఎస్, విక్రాన్‌ సంస్థలు పాల్గొనగా షిరిడీ సాయి ఎల్‌ 1 గా నిలిచింది. ఒక్కో వ్యవసాయ సర్వీసుకు, అనుబంధ పరికరాలతో కలిపి రూ.11,191.64 మాత్రమే. పన్నులతో కలిపి మొత్తం రూ.13,334.88 ఖర్చవుతుంది. స్మార్ట్‌ మీటర్ల ధరను మాత్రమే కేంద్రం రూ.6 వేలతో అంచనా వేసింది. ఒక్కో మీటరు వ్యయం రూ.36,700కు కొంటుందనడంలో వాస్తవం లేదు. ఆపరేషన్, మెయింటెనెన్స్, రీడింగ్స్‌ కోసం అయ్యే మొత్తాన్ని నెలవారీగా 93 నెలల కాంట్రాక్ట్‌ కాల వ్యవధిలో ప్రాజెక్టు వ్యయాన్ని చెల్లిస్తారు. వీటికి నెలకు రూ.194 చొప్పున టెండర్లను దాఖలు చేశారు. 

మీటరు బాక్స్‌తో పాటు పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్తింగ్‌ పరికరాలను ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా విద్యుత్‌ ప్రమాదాలు, ట్రాన్స్‌ఫార్మర్‌ ఫెయిల్యూర్స్‌ తగ్గుతాయి.

వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్‌ మీటర్ల ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. రైతులు పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్తు యథాతథంగా కొనసాగుతుంది. ప్రజల నుంచి ఏ విధమైన ట్రూ అప్‌ చార్జీలు వసూలు చేయరు.

ఉత్తరప్రదేశ్‌లోని మధ్యాంచల్‌ విద్యుత్‌ వితరణ్‌ నిగమ్‌ మీటరుకు రూ.10 వేలు చొప్పున సింగిల్‌ ఫేజ్‌ మీటర్లను మాత్రమే ఏర్పాటు చేస్తోంది. వీటికి ఎటువంటి అనుబంధ పరికరాలూ లేవు. మన రాష్ట్రంలో మొత్తం అన్ని పంపుసెట్లకు త్రీ ఫేజ్‌ స్మార్ట్‌ మీటర్లతో పాటు అనుబంధ పరికరాలను ఏర్పాటు చేస్తున్నాం. మహారాష్ట్రలోని పట్టణ ప్రాంతాల్లో ఒక్కో స్మార్ట్‌ మీటరుకు ఏడున్నరేళ్ల పాటు నెలకు రూ.200.96గా ధర ఖరారు కాగా వాటిలో 80 శాతం సింగిల్‌ ఫేజ్‌వే. ఏపీలో మొత్తం త్రీ ఫేజ్‌ మీటర్లే. అయినప్పటికీ ఇక్కడ 93 నెలలకు నెలకు రూ.194 మాత్రమే చెల్లిస్తారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)