Breaking News

ఇంత జరిగాక దర్యాప్తు ఆపమని చెప్పలేం: ఏపీ హైకోర్టు

Published on Fri, 09/22/2023 - 14:28

సాక్షి, కృష్ణా:  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడికి ఎదురుదెబ్బ తగిలింది.  ఆయన దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొట్టేసింది. 

క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ‘పిటిషన్‌ డిస్మిస్డ్‌’ అంటూ ఏకవాక్యంతో తీర్పు ఇచ్చారు హైకోర్టు న్యాయమూర్తి. ఇక 68 పేజీలతో కూడిన చంద్రబాబు క్వాష్‌ ఆర్డర్‌ కాపీలో ఏపీ హైకోర్టుల కీలక వ్యాఖ్యలు చేసింది.

విచారణ కీలక దశలో క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ ఆపడం సరికాదు. ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప ప్రతిసారి పిటిషన్‌ను క్వాష్‌ చేయలేం.అసాధారణ పరిస్థితుల్లో ఉంటేనే ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలి. ఎఫ్‌ఐఆర్‌లో అన్ని విషయాలు ఉండాల్సిన అవసరం లేదు. విచారణ పూర్తి చేసే అధికారాన్ని పోలీసులకు ఇవ్వాలి. విచారణ అంశాలను తర్వాతి దశలో ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయొచ్చు. విచారణలో ఎఫ్‌ఐఆర్‌ మెరిట్స్‌ మీద కేసును అడ్డుకోకూడదు. సీఆర్‌పీసీ 482 కింద దాఖలైన పిటిషన్‌పై మినీ ట్రయల్‌ నిర్వహించలేం. 2021 నుంచి 140 మందిని సీఐడీ విచారించింది. నాలుగు వేల దాకా డాక్యుమెంట్లు సేకరించింది. ఈ దశలో ఈ విచారణలో జోక్యం చేసుకోలేం. కేసు దర్యాప్తు కొనసాగుతున్నందు వల్ల మేం జోక్యం చేసుకోలేం’’ అని స్పష్టం చేసింది. 

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ రెండేళ్ల దర్యాప్తు తదనంతరం.. తనపై నమోదు అయిన ఎఫ్‌ఐఆర్‌, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆయన క్వాష్‌ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరపున న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, సిద్ధార్థ లుథ్రా వాదనలు వినిపించారు. మరోవైపు సీఐడీ తరపున ముకుల్‌ రోహత్గీ వాదించారు. సీఐడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేసింది.

మరోవైపు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో చంద్రబాబు రిమాండ్‌ను అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం(ఏసీబీ కోర్టు) రెండ్రోజులు పొడిగించిన సంగతి తెలిసిందే


హైకోర్టు ఆర్డర్‌ పూర్తి కాపీ కోసం క్లిక్‌ చేయండి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)