Breaking News

పిడుగుపాటుకు ఆరుగురు మృతి

Published on Mon, 05/05/2025 - 04:48

సాక్షి నెట్‌వర్క్‌: కుండపోత వర్షానికి తోడు ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటుకు ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లిలో ఈదురు గాలుల ధాటికి చెట్టు విరిగి రేకుల ఇంటిపై పడటంతో ఇంట్లో ఉన్న పన్నెండేళ్ల బాలుడు మామిళ్ల బాలగోవింద్‌ ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యులు గాయపడ్డారు. కృష్టా జిల్లా మొవ్వ మండలం కోసూరుకు చెందిన మాతంగి సుప్రదీప్‌ (22) బాపట్ల జిల్లా గాజుల్లంక వెళ్తుండగా పిడుగుపడి మృత్యువాత పడ్డాడు. స్నేహితుడైన పాగోలు అనిల్‌కుమార్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

సుప్రదీప్‌ ఘటనా స్థలంలోనే మృతిచెందగా.. అనిల్‌ కుమార్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మరోవైపు చినగంజాం మండలం సోపిరాలలోని రామకోటేశ్వర కాలనీకి చెందిన గడ్డం బ్రహ్మయ్య గొర్రెలు మేపేందుకు పొలం వెళ్లగా పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. బాపట్ల జిల్లా కొల్లూరు సమీపంలోని పొలాల్లో మహబూబ్‌నగర్‌ జిల్లా కోయలకొండ మండలానికి చెందిన అంజి అనే గొర్రెల కాపరి పిడుగు పడి గాయపడ్డాడు. తన మొబైల్‌ ఫోన్‌కు పవర్‌బ్యాంక్‌తో చార్జింగ్‌ పెట్టి బంధువులతో ఫోన్‌లో మాట్లాడుతుండగా.. అతి సమీపంలో పిడుగు పడింది.

చెవులు, ముక్కు నుంచి రక్తం రావడంతో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తిరుపతి జిల్లా రాపూరు మండలం, రావిగుంటపల్లికి చెందిన తాటిబోయిన చిన్నయ్య (35), ఓజిలి మండలం గొల్లపాళెంకు చెందిన మారుబోయిన కార్తీక్‌ (10), నాయుడుపేట మండలం వద్దిగుంటకండ్రిగకు చెందిన రైతు భాస్కర్‌ (53) పిడుగుపాటుకు మృతిచెందారు.అలాగే, తిరుపతి జిల్లా చిల్లకూరి మండలం కాకులపాలెం వద్ద పిడుగుపడి బాతుల కాపరి ముణీంద్ర(40) మృతి చెందాడు.    చిల్లకూరు మండలం వడ్డికండ్రిగలో ఆవుదూడ సైతం మృతిచెందింది. గూడూరు మండలం, చెన్నూరు పంచాయతీలో పిడుగు పడి  శ్రీనివాసులకు చెందిన  పాడి గేదె మృతి చెందింది. తిరుపతి అర్బన్‌ మండలం మంగళం పరిధిలోని బొమ్మల క్వార్టర్స్‌లో కె.లలితకు చెందిన భారీ షెడ్డు కూలిపోయింది. షెడ్డు లోపల తయారీలో ఉన్న 40 పెద్ద వినాయక విగ్రహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 

కూలిన చెట్లు, ఎగిరిన ఇంటి పైకప్పులు
తిరుపతిలోని శివజ్యోతి నగర్, హరేకృష్ణ రోడ్, మహిళా యూనివర్సిటీ, ఎస్వీ యూనివర్సిటీ, తిమ్మనాయుడుపాలెం, కపిల తీర్థం ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. 15 నిమిషాల పాటు వడగండ్ల వాన పడింది. ఎన్టీఆర్‌ జిల్లాలో ఆదివారం ఉదయం అరగంట వ్యవధిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లాలో 14.87 మిల్లీవీుటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా విస్సన్నపేట మండలంలో 54.4 మిల్లీవీుటర్లు వర్షం కురిసింది. గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఆదివారం ఈదురుగాలులు, భారీ వర్షం బీభత్సం సృష్టించాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని పాత జాతీయ రహదారి వెంబడి స్పెన్సర్‌ దగ్గర నుండి ఉండవల్లి సెంటర్‌ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు విరిగి రాకపోకలకు ఇబ్బంది కలిగింది.

నులకపేట తెల్ల క్వారీ, మదరసా, ఎర్ర క్వారీ ప్రాంతాల్లో చెట్లు విరిగి ఇళ్లపై పడి రేకులు పగిలిపోగా, మరికొన్ని నివాసాలపై రేకులు గాల్లోకి ఎగిరాయి. ఉండవల్లి దళితవాడకు వెళ్లే దారిలో ఓ ఇంటి పైకప్పు గాలిలోకి ఎగిరి గోడలు కూలాయి. ఉండవల్లిలోని పుష్కరాల కాలనీలో ఇంటి పైకప్పులు పైకి ఎగిరిపోయాయి. వడ్డెర కాలనీలో ఇళ్లపై చెట్లుపడి రేకులు పగిలిపోయాయి. సీతానగరంలో రెండుచోట్ల ఇంటి పైకప్పు గాలిలోకి ఎగిరాయి. తాడేపల్లిలో 25 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఉండవల్లిలో 6 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ జారిపడింది. తిరుపతి జిల్లా వాకాడు మండలంలో భీకరమైన శబ్దాలతో ఉరుములు, పిడుగులు, పెనుగాలులు, భారీ వర్షం కురిసింది. తూపిలిపాళెం సముద్రం అల్లకల్లోలంగా మారింది. విజయవాడలోని పలు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. వర్షం ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 పరీక్షలు రాసేందుకు బెజవాడ వచ్చిన అభ్యర్థులు అవస్థలు పడ్డారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)