Breaking News

నీటిలో మునిగి ఆరుగురి మృతి

Published on Mon, 06/09/2025 - 02:30

డుంబ్రిగుడ/అమరావతి/ఏయూ క్యాంపస్‌(విశాఖ జిల్లా): అల్లూరి సీతారామరాజు, పల్నాడు, విశాఖ జిల్లాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో నీటిలో మునిగి ఆరుగురు మృతి చెందారు. అల్లూరి జిల్లా పోతంగి పంచాయతీ బిల్లాపుట్టు గ్రామానికి చెందిన అన్నదమ్ములు గుంట కమందన్, గుంట రామదాస్‌ కుమారులు గుంట సాయికిరణ్‌ (14), గుంట భానుతేజ్‌ (14)లు 9వ తరగతి చదువుతున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో వీరు డుంబ్రిగుడ మండలం గంగవలస గ్రామంలో ఉన్న తమ మేనత్త ఇంటికి వెళ్లారు. 

ఆదివారం మామిడి పండ్లు సేకరించేందుకు కొండ వద్దకు వెళ్లి వస్తున్న తరుణంలో..అదే గ్రామానికి చెందిన వీరి స్నేహితుడు కొర్ర సుశాంత్‌(14)తో కలిసి చెరువులో స్నానాలకు దిగారు. ఇటీవల మన్యంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో చెరువులో 12 అడుగుల మేరకు నీరు చేరింది. ఇది గమనించని విద్యార్థులు ఈతకు దిగి..మునిగిపోయారు. వారిని రక్షించేందుకు సమీపంలోని పొలాల వద్ద ఉన్న వారు వచి్చనా ఫలితం లేకపోయింది. దీంతో ముగ్గురూ మృతి చెందారు. 

అలాగే, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అగతవరప్పాడు ఏవీఎస్‌ కాలనీ నుంచి రెండు కుటుంబాలకు చెందిన 10 మంది బక్రీద్‌ అనంతరం నదిలో స్నానాలు చేసేందుకు ఆదివారం పల్నాడు జిల్లాలోని అమరావతికి వచ్చారు. అమరేశ్వరఘాట్‌ సమీపంలో కృష్ణానదిలోని ఇసుకలో బాల్‌తో ఆడుకుంటుండగా.. బాల్‌ పక్కనే ఉన్న నదిలో పడింది. 

బాల్‌ కోసం సయ్యద్‌ ఖాదర్‌ వలి (13), సయ్యద్‌ కాజా(21)లు నీటిలో దిగి...మునిగిపోయారు. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పగా..సీఐ అచ్చియ్య ఘటనా స్థలాన్ని సందర్శించి గజ ఈతగాళ్లను రప్పించారు. వారు గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. 

బాలుడిని బలిగొన్న అలలు 
విశాఖ సాగర తీరంలో విక్టరీ ఎట్‌ సీ ఎదురుగా బీచ్‌లో స్నానానికి దిగి ఎం.శ్రీపాద సూర్య(7) కెరటాలకు బలయ్యాడు. ఆదివారం ఉదయం అగనంపూడికి చెందిన ఓ కుటుంబం బీచ్‌కు వచ్చింది. వీరిలో స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న సతీష్‌ది శనివారం పెళ్లి రోజు. వేడుకల అనంతరం ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి బీచ్‌కు వచ్చారు. 

సముద్రంలో స్నానం చేస్తుండగా బలమైన కెరటాలు బాలుడిని లోపలికి లాక్కెళ్లాయి. సమీపంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు పరదేశి వెంటనే ఘటనాస్థలికి చేరుకుని బాలుడిని రక్షించే ప్రయత్నం చేశారు. బాలుడిని వెంటనే ఒడ్డుకు తీసుకువచ్చి 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలించారు. బాలుడు నీరు ఎక్కువగా తాగడంతో మరణించినట్లు కేజీహెచ్‌ వైద్యులు వెల్లడించారు. బాలుడి తల్లిదండ్రులను వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్లబాబురావు పరామర్శించారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)