‘సర్‌’ ఇంటింటి సర్వే ఇక మూడు రోజులే

Published on Sun, 07/12/2026 - 05:11

సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో ఇంటింటి సర్వే మరో మూడు రోజుల్లో ముగియనుందని, జూన్‌ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి సర్‌ మ్యాపింగ్‌ యాప్‌ పని చేయడం ఆగిపోతుందని, గడువు పెంచే ప్రసక్తే లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. జూలై 11 సాయంత్రం నాలుగు గంటల వరకు మొత్తం 4,16,27,694 మంది ఓటర్లకు గాను 3,61,23,312 ఓటర్ల వివరాలు డిజిటలైజ్డ్‌ అయ్యాయని, మిగిలిన మూడు రోజుల్లో 55,04,382 ఓటర్ల వివరాలను డిజిటలైజ్డ్‌ చేయాల్సి ఉంటుందని చెప్పారు. 

ఇప్పటి వరకు డిజిటలైజ్డ్‌ అయిన ఓటర్లలో సుమారు 10 శాతం మంది ఓటర్లలో మరణించిన వాళ్లు, ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్న వారు, దొరకని ఓటర్లు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జూలై 21న విడుదల చేసే ముసాయిదా ఓటర్ల జాబితాతోపాటు మరణించిన, డూప్లికేట్, దొరకని ఓటర్ల వివరాల జాబితా కూడా పోలింగ్‌ కేంద్రాలు, సచివాలయాల వద్ద ప్రదర్శించనున్నట్లు తెలిపారు. జాబితాలో పేరులేని వారు 2002 ఓటర్ల జాబితా వివరాలను తీసుకొని ఫారం–6 ద్వారా బీఎల్‌వోతో ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. 

2002 జాబితాలో పేరు లేని వారు గుర్తించిన 11 ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి జత చేయడం ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. 21న జాబితాలో పేర్లు లేని వారు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఆగస్టు 20 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌ 22న తుది ఓటర్ల జాబితా ప్రకటనతో రాష్ట్రంలో సర్‌ ప్రక్రియ ముగుస్తుందని, ఆ తర్వాత ఎప్పటిలాగే కొత్త ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియ యధావిధిగా కొనసాగుతుందన్నారు. 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)