Breaking News

మెడికల్‌ సీట్లు వదులుకోవడం హేయం

Published on Sun, 09/15/2024 - 05:09

కాశీబుగ్గ: మెడికల్‌ సీట్లు వదులుకోవడం హేయ­మైన చర్య అని.. ఈ విష­యంలో ఏకైక అత్యంత చెత్త ప్రభుత్వం చంద్ర­బాబుదేనని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. కూటమి ప్రభు­త్వం పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి నో చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మాటలు ఆశ్చర్యం కలిగించాయన్నారు.

చంద్రబాబు హామీలకు తాను గ్యారంటీ అన్న పవన్‌కళ్యాణ్‌ దీనిపై స్పందించాలని కోరారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 17 మెడికల్‌ కాలేజీలు స్థాపించేందుకు గత సీఎం వైఎస్‌ జగన్‌ ఏర్పాట్లు చేశారని, వాటిలో ఐదింటిని పూర్తి చేశారని గుర్తు చేశారు. ఫలితంగా 2023–24లో విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాలలో వైద్య కళాశాలలు ప్రారంభమై ఒకేసారి 750 మెడికల్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు.

మళ్లీ వైఎస్‌ జగన్‌ సీఎం అయి ఉంటే.. ఈ విద్యా సంవత్సరంలో పాడేరు, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని వైద్య కళాశాలలు సైతం ప్రారంభమై మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చి ఉండేవని అన్నారు. మరోవైపు ముందుగా నిర్దేశించుకున్నట్టు 2025–26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, పెనుకొండ, పాలకొల్లు, నర్సీపట్నం, పార్వతీపురం, బాపట్ల, అమలాపురంలలో ఏడు కాలేజీలు కూడా ప్రారంభమైతే రాష్ట్రంలో మొత్తం మెడికల్‌ సీట్లు దాదాపు 5వేలకు చేరేవన్నారు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?