AP: పోలీసుల దాష్టీకం.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తను హింసించిన ఎస్‌ఐ

Published on Thu, 04/10/2025 - 09:31

సాక్షి, ప్రకాశం: ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో అధికారుల అండతో పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టార్గెట్‌ చేసి అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ ఎస్‌ఐ దారుణంగా వ్యవహరించారు. అక్రమ కేసు బనాయించి.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తను విచక్షణారహితంగా కొట్టారు.

వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాలోని తాళ్లూరు ఎస్‌ఐ మల్లికార్జున.. వైఎస్సార్‌సీపీ కార్యకర్త విష్ణుపై అక్రమంగా కేసు పెట్టారు. కొర్రపాటిపాలెంకు చెందిన విష్ణు.. వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీ కట్టాడనే కారణంగా అతడిపై ఎస్‌ఐ మల్లికార్జున కేసు పెట్టారు. ఈ క్రమంలో విష్ణుపై కక్షగట్టిన టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, టీడీపీ నేతల ప్రోద్భలంతో ఎస్‌ఐ.. వారి ఫిర్యాదు తీసుకుని విష్ణును స్టేషన్‌కు తరలించారు. అనంతరం,స్టేషన్‌కు వచ్చిన తర్వాత.. విష్ణుపై ఎస్‌ మల్లికార్జున విచక్షణారహితంగా దాడి చేశారు. తన బెల్టుతో విష్ణును చితకబాదారు. తర్వాత వదిలిపెట్టారు. దీంతో, బాధితుడు విష్ణుకు గాయాలు కావడంతో ఒంగోలు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దర్శి ఎమ్మెల్యే, జిల్లాపార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి.. అర్ధరాత్రి అతడిని పరామర్శించారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)