పూజారులకూ షోకాజ్‌ నోటీసులు

Published on Mon, 07/28/2025 - 05:29

చిలకలూరిపేట: దైవకార్యం అయినా.. మరొకటి అయినా అగ్రతాంబూలం తమకే దక్కాలన్న అహం టీడీపీ నేతల్లో పెరిగిపోయింది. ఆ అహమే పూజారుల పట్ల శాపంగా మారింది. చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నం శ్రీ గోపీనాథస్వామి ఆలయంలో మాజీమంత్రి విడదల రజిని కుటుంబ సభ్యులతో పూజలు చేయించారన్న కారణంగా పూజారులకు ఆలయ కార్యనిర్వహణాధికారి నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. మాజీమంత్రి విడదల రజిని కుటుంబానిది పురుషోత్తమపట్నం కాగా.. ఈ గ్రామంలో ప్రాచీన గోపీనాథస్వామి ఆలయం ఉంది. 

 ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి విడదల రజిని సహకారంతో దీనిని పునర్నిర్మింపజేరు. తొలినుంచీ విడదల రజిని మామయ్య లక్ష్మీనారాయణ, ఆయన కుటుంబం సభ్యులు గోపీనాథస్వామి భక్తులు కావడంతో తరచూ ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. విరాళాలు ఇస్తూ ఆలయ అభివృద్ధిలో భాగస్వాములుగానూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 25న శ్రావణ శుక్రవారం కావడంతో ఆలయంలో పూజలు నిర్వహించేందుకు భక్తులు భారీగా హాజరయ్యారు.

పూజలు చేయించడమే నేరమైంది 
సాధారణ భక్తులతోపాటు వచ్చిన విడదల లక్ష్మీనారాయణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు సైతం శుక్రవారం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో టీడీపీ నాయకులకు పట్టరాని కోపం వచి్చంది. ఇంత పెద్దఎత్తున ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పు­డు ముఖ్య అతిథులుగా తమను మాత్రమే పిలవాలని ఆలయ ఈవోపై ఆగ్రహం వెళ్లగక్కారు. ఈవోపై రాజకీయ ఒత్తిడి తెచ్చి అర్చక స్వాములకు నోటీసులు ఇప్పించారు. 

ఆలయంలో పెద్దఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో కార్యనిర్వహణాధికారి దృష్టికి తీసుకురాకపోవడానికి కారణం తెలపాలని అర్చకులు మురికిపూడి శ్రీనివాసాచార్యులు, శ్రీమన్నారాయణాచార్యులుకు ఈవో నోటీసులు ఇచ్చారు. తమ అనుమతి లేకుండా వందలాది మంది భక్తులకు పూజలు ఏర్పాటు చేయడంపై 7 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నారు. 

ఈ వ్యవహారం ఆనోటా, ఈనోట బహిర్గతం కావడంతో ఇదేమి చోద్యం అంటూ ప్రజలు విస్తుపోతున్నారు. ‘పర్వదినం రోజుల్లో దేవుడికి పూజలు చేసినా పాపమై పోయిందా... ఇవెక్కడి రాజకీయాలు రా నాయనా’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఆల­య ఈవో కె.మంజూషను వివరణ కోరగా.. అనుమతి తీసుకోకుండా కుంకుమార్చన వంటి పూజ­లు నిర్వహించినందుకు ఆలయ అర్చకులతో పాటు, గుమస్తాకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. 

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)