Breaking News

రషీద్ హత్య వెనుక లేడీ డాన్?.. వెలుగులోకి సంచలన విషయాలు

Published on Thu, 09/11/2025 - 11:40

గూడూరు రూరల్‌: పట్టణంలోని గాంధీనగర్‌ శ్మశాన వాటిక సమీపంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన బుధవారం ఉదయం వెలుగుచూసింది. వివరాలు.. స్థానిక టిడ్కో ఇళ్లలో నివాసముండే షేక్‌ రహీద్‌(35) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చిన రహీద్‌ బుధవారం ఉదయం రోడ్డు పక్కన మృతదేహంగా కనిపించాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కత్తిపోట్ల కారణంగా రహీద్‌ మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీమ్‌ను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ గీతాకుమారి ఆదేశాల మేరకు టూటౌన్‌ సీఐ శ్రీనివాస్, వాకాడు సీఐ హుస్సేన్‌బాషా విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మృతుడి కుటుంబీకులు, బంధువులు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. నిందితులను అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

కాగా, రషీద్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రషీద్ హత్య వెనుక లేడీ డాన్ వందన ప్రమేయం ఉన్నట్లు సమాచారం. టిడ్కో గృహాల కాలనీలో వ్యభిచారం, గంజాయి, సెటిల్‌మెంట్‌తో లేడీ డాన్‌గా వందన ఎదిగింది. వందన క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడంతో రషీద్ హత్యకు గురైనట్లు సమాచారం. లేడీ డాన్ వందనతో పాటు ఆమె అనుచరులు వెంకీ, హన్షిద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)