Breaking News

ఆరు నెలల బాబు.. రూ.5 లక్షలకు విక్రయం

Published on Wed, 01/28/2026 - 12:39

పశ్చిమ గోదావరి జిల్లా: మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. వ్యవస్థలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే గుండె బరువెక్కుతుంది. ఓ వ్యక్తి భార్యను కాదని మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆపై ఆమెకు బాబు పుట్టాడు. ప్రస్తుతం ఆ బాబు వయసు ఆర్నెల్లు. సదరు వ్యక్తి తన భార్యతో కలిసి అన్నెంపున్నెం ఎరుగని ఆ బాబును రూ.5 లక్షలకు విక్రయించిన ఉదంతం తూర్పు గోదావరి జిల్లాలో వెలుగు చూసింది. 

ఎస్‌ఐ మనోహర్‌ కథనం ప్రకారం.. గోపాలపురం మండలం వాదాలకుంట గ్రామానికి చెందిన జొన్నకూటి వీరయ్య, చిన్నారి భార్యాభర్తలు. అయితే అదే మండలంలోని చిట్యాలకు చెందిన చిన్నం జ్యోతికతో కలిసి వీరయ్య కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. చెడు అలవాట్లకు బానిసైన వీరయ్య ఆరి్థకంగా ఇబ్బందులు పడుతున్నాడు. మరోవైపు జ్యోతిక, వీరయ్యకు బాబు పుట్టాడు. ప్రస్తుతం ఆ బాబుకు ఆరు నెలలు కాగా దేవరపల్లికి చెందిన టి.సురేష్‌ ద్వారా వీరయ్య, అతడి మొదటి భార్య చిన్నారి కలిసి రూ.5 లక్షలకు విక్రయించేందుకు పథకం వేశారు. 

ఈ మేరకు ఈ నెల 19న మధ్యవర్తికి ఆ బాబును అప్పగించి, అతడి నుంచి ముందుగా రూ.1.50 లక్షలు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న జ్యోతిక పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ బాబు మధ్యవర్తి వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఆ బాబు­ను తెచ్చి తల్లి జ్యోతికకు అప్పగించారు. వీరయ్య, చిన్నారి దంపతులను మంగళవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ మనోహర్‌ తెలిపారు.   

Videos

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)