Breaking News

9 నెలల గర్భిణిని హత్య చేసిన భర్త

Published on Tue, 04/15/2025 - 07:10

మధురవాడ(భీమిలి): కట్టుకున్న భర్తే కాలయముడిగా మారి నిండు చూలాలైన భార్యను గొంతు నులిమి హత్య చేసిన ఘటన విశాఖపట్నం మధురవాడ ఆర్టీసీ డిపో సమీపంలో చోటు చేసుకుంది. విశాఖ నార్త్‌ జోన్‌ ఏసీపీ అప్పలరాజు, మృతురాలి బంధువుల వివరాల ప్రకారం... కూర్మన్నపాలెం సెక్టార్‌–2, దువ్వాడకు చెందిన గెద్డాడ జ్ఞానేశ్వర్‌(28), అనకాపల్లి జిల్లా నర్సీపటా్ననికి చెందిన కేదారిశెట్టి అనూష (27)తో 2023లో వివాహమైంది. జ్ఞానేశ్వర్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌లో పనిచేస్తూ స్కూళ్లలో ట్రైనింగ్‌ ఇస్తుంటాడు. ఏడాది క్రితం వీరిద్దరూ మిథిలాపురి వుడాకాలనీకి వచ్చారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా... అప్పుడప్పులు గొడవలు పడుతుండేవారు. ఏడాది కాలంగా జ్ఞానేశ్వర్‌ ఆమె అడ్డు తొలగించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. 

నూషకు తొమ్మిది నెలలు నిండగా సోమవారం కాన్పు నిమిత్తం ఆస్పత్రిలో చేరాల్సి ఉంది. ఇందుకోసం ఆమె అమ్మమ్మ అన్నవరం వచి్చంది. ఈక్రమంలో సోమవారం ఉదయం జ్ఞానేశ్వర్‌ భార్య అనూషను హత్యచేసి ఏమీ తెలియనట్టు బెడ్‌రూంలో కూర్చున్నాడు. అనూషను ఆస్పత్రికి తీసుకెళ్లే సమయం అవుతుండటంతో అమ్మమ్మ అన్నవరం ఆమెను పిలిచింది. స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి తట్టి లేపింది. అయినా కదలకపో­వడంతో జ్ఞానేశ్వర్‌కు చెప్పింది.

 ఏమీ తెలియనట్టు వెంటనే జ్ఞానేశ్వర్‌ స్థానికుల సా­యంతో అనూషను ఆరిలో­వ కేర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. వైద్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న సీఐ బాలకృష్ణ విచారణ చేపట్టారు. ఇంటికి ఆలస్యంగా వస్తుండటంతో తనను అనూష అనుమానించి మానసికంగా హింసించిందని, విసుగు చెంది గొంతు నులిమి హత్యచేసినట్టు నిందితుడు జ్ఞానేశ్వర్‌ విచారణలో అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.   

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)