Breaking News

టీడీపీ ‘ప్రేమఖైదీ’!

Published on Sun, 08/24/2025 - 05:31

సాక్షి, టాస్క్ ఫోర్స్‌: నెల్లూరు సెంట్రల్‌ జైల్లో జీవిత ఖైదిగా శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్‌ పెరోల్‌ వెనుక భారీ డీల్‌ నడిచింది. దశాబ్దకాలం పైగా శ్రీకాంత్‌ సైన్యంతో నెల్లూరును నేరమయం చేసిన ఓ టీడీపీ ప్రజాప్రతినిధి పెరోల్‌ ద్వారా అతడిని బయటకు రప్పించేందుకు వ్యవహారం నడిపించాడని పోలీస్‌ నిఘా వర్గాల విచారణలో తేలినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన శ్రీకాంత్‌ నాలుగు జిల్లాల్లో తన నేరసామ్రాజ్యాన్ని విస్తరించాడు. వంద మందికిపైగా సైన్యా­న్ని కూడగట్టుకున్నాడు. వారి ద్వారానే సెటిల్‌మెంట్లు, దందాలు, బెదిరింపులు, చేయిస్తున్నాడని పోలీస్‌శాఖ విచారణలో తేలింది. 

నెల్లూరుకు చెందిన ప్రజాప్రతినిధి కనుసన్నల్లో శ్రీకాంత్‌ అతని సైన్యం నడుస్తున్నట్టు తేటతెల్లమైంది. నెల్లూరులో జరిగే సెటిల్‌మెంట్లు, సింగిల్‌ నంబర్ల ఆట, బెట్టింగ్, ఆర్థిక నేరాలు అన్నింటినీ అతని ద్వారానే నడి­పిస్తూ నగరంలో ప్రజాప్రతినిధితో పెట్టుకుంటే నూకలు చెల్లినట్లే అనే భయాన్ని కలిగించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఫలితంగా దశాబ్దకాలంగా నెల్లూరులో ఆ ప్రజాప్రతినిధిని చూస్తేనే నగర వాసులు వణికిపోయే పరిస్థితి నెలకొంది.   

ఇద్దరు ఎమ్మెల్యేల సిఫార్సు’లతోనే.. 
శ్రీకాంత్‌ పెరోల్‌ విషయంలో సిఫార్సు లెటర్లు ఇచ్చినా రిజక్ట్‌ చేశారంటూ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు బుకాయిస్తున్నప్పటికీ వారి ఒత్తిడి, హోంమంత్రి అండతో హోంశాఖ పెరోల్‌ ఉత్తర్వులు ఇచ్చిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. శ్రీకాంత్‌ను బయటకు రప్పించి మరిన్ని సెటిల్‌మెంట్లతో ప్రజాధనాన్ని దోచేసేందుకు పెరోల్‌ అస్త్రాన్ని బయటకు తీశారు. అధికారులు అడ్డుపడడంతో కీలక మంత్రికి రూ.2 కోట్ల డీల్‌ కుదిర్చారన్న ప్రచారం ఉంది. ఆ డబ్బుతోనే పెరోల్‌తోపాటు వచ్చే  ఏడాది జనవరిలో స్రత్పవర్తన కింద విడుదలయ్యే ఖైదీల జాబితాలో శ్రీకాంత్‌ పేరు చేర్చేలా ఒప్పందం చేసుకున్నారనే ప్రచారం సాగుతోంది.

అరుణ వ్యవహారంతోనే వెలుగులోకి.. 
ఇటీవల పెరోల్‌లో బయటకు వచ్చిన శ్రీకాంత్‌ తన సన్నిహితురాలు అరుణనురౌడీ సామ్రాజ్యానికి రాణిని చేసేందుకు తన సైన్యంతో సమావేశం పెట్టడం వల్లే అతని పెరోల్‌ వ్యవహారం లీకైనట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆస్పత్రిలో శ్రీకాంత్‌తో అరుణ సన్నిహితంగా ఉన్న వీడియోలూ అతని సైన్యాధిపతి తీసినవేనని తెలుస్తోంది. 

ఎక్కడ తమ ఆధిపత్యం పోతుందోనని ఆ సైన్యాధి­పతి లీకులు ఇచ్చారనే ప్రచారం ఉంది. ఈ వ్యవహారం ఎల్లో మీడియా వైఎస్సార్‌సీపీకి అంటగట్టేలా చేసిన యత్నాలు బూమ్‌రాంగ్‌ కావడంతో ప్రభుత్వం ఇరుకున పడింది.  ఇదే అదనుగా కూటమిలోని ప్రజాప్రతినిధి వ్యతిరేక వర్గం ఎల్లో మీడియాలో ఓ వర్గాన్ని ప్రో­త్సహించి వ్యవహారాన్ని బజారులో పెట్టేలా చేశారనే ప్రచారం తీవ్రంగా జరుగుతోంది.

శ్రీకాంత్‌ పెరోల్‌కు సిఫార్సు లేఖ ఇచ్చిన మాట వాస్తవమే 
నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి 
నెల్లూరు సిటీ: నెల్లూరు కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్‌ పెరోల్‌కు తాను సిఫార్సు లేఖ ఇచి్చన మాట వాస్తవమేనని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఒప్పుకున్నారు. శనివారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాంత్‌ పెరోల్‌ కోసం తనతో పాటు గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌ కూడా లేఖ ఇచ్చారని చెప్పారు. తమ లేఖల్ని జూన్‌ 16న రిజెక్ట్‌ చేసిన అధికారులు పెరోల్‌ ఇవ్వలేమని చెప్పారన్నారు. జూలై 30న హోంశాఖ మంత్రి కార్యాలయం నుంచి పెరోల్‌కు అనుమతి ఇచ్చిందన్నారు. 

పెరోల్‌ విషయంలో తమకేం సంబంధం లేదన్నారు. ఇకపై తాను బతికుండగా పెరోల్‌ కోసం సిఫార్సు లెటర్లు ఇవ్వనని చెప్పారు. ఇది తనకు గుణపాఠం లాంటిదన్నారు. గత ప్రభుత్వంలో కూడా శ్రీకాంత్‌ పెరోల్‌కు సిఫార్సు లెటర్లు ఇచ్చానని అన్నారు. లేఖలు ఇవ్వడం సాధారణమన్నారు. అధికారులు నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)