బలహీన పడ్డ తీవ్ర వాయుగుండం.. మరో మూడు రోజులు వర్షాలు..

Published on Fri, 10/03/2025 - 19:26

విశాఖ : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండ కాస్తా వాయుగుండంగా బలహీనపడింది. ప్రస్తుతం దక్షిణ ఒడిశాలో వాయుగుండంగా కొనసాగుతోంది. ఒడిశాలో దక్షిణ నైరుతి దిశలో కేంద్రీకృతమై ఉంది. వచ్చే 24 గంటల్లో ఒడిశా నుంచి ఉత్తర ఛత్తీస్‌ఘడ్‌ వరకు పయనించి మరింత బలహీనపడే అవకాశం ఉంది.  ఏపీలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు గా వర్షాలు పడే అవకాశం ఉంది. 

కొన్ని చోట్ల  ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది దీని ప్రభావంతో పార్వతీపురం మన్యం, ఏలూరు, ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు జిల్లా లో కొన్ని ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు అవకాశం ఉంది. 35 నుంచి 45 కిలోమీటర్లు, గరిష్టం గా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. టెక్కలి, మందస 17 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. 

శ్రీకాకులం జిల్లాలో భారీ వర్షాలు
తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. కేరాసింగ్‌లో రోడ్డుపై కొండచరియుల విరిగిపడ్డాయి. వరద ఉధృతికి రహదారి భారీగా కోతకు గురైంది. ఆముదాలవలస, సిరుబుజ్జిలి మండలాల్లో భారీ వర్షం కురవగా, ఎల్‌ఎన్‌పేట, బూర్గ, జలుమూరు మండలాల్లో భారీ వర్షం పడింది. 

పార్వతీపురం నాగావళి నదికి వరద ఉధృతి పోటెత్తింది. బాసింగి గ్రామం వరద ముంపునకు గురైంది. సంగమేశ్వరస్వామి వారి ఆలయం నీట మునిగింది. మరొకవైపు అల్లూరి జిల్లాలో సైతం పలుచోట్ల వర్షం పడింది. చింతూరు, వీఆర్‌పురం మండలాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సోకిలేరు ఉధృతంగా ఉండటంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. దీనిపై ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టకపోవడంతో ఆ గ్రామ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు తక్షణ ఆర్థిక సాయం అందక బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు