Breaking News

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కేసు.. చందాదారుల చాటున పిటిషన్లు!

Published on Thu, 07/13/2023 - 04:55

సాక్షి, అమరావతి: భారీగా ఆర్థిక అక్రమాలు వెలుగు చూసిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో కొన్ని చిట్‌ గ్రూపులను మూసివేసిన నేపథ్యంలో యాజమాన్యం తన చందాదారులను రంగంలోకి దించింది. చిట్‌ గ్రూపుల మూసివేతను సవాల్‌ చేస్తూ వారి ద్వారా హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లను దాఖలు చేయించింది.

పిటిషన్లు దాఖలు చేసిన న్యాయవాదులు కూడా వేర్వేరు. పిటిషన్లు వేర్వేరు అయినప్పటికీ అందులో పేర్కొన్న వివరాలన్నీ దాదాపు ఒకే రకంగా ఉన్నాయి. పేరా నంబర్లు సైతం ఒకటే ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు కాగా పిటిషనర్ల తరఫున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు ప్రముఖ సీనియర్‌ న్యాయవాదుల్లో ఒకరైన మీనాక్షి అరోరాను రంగంలోకి దించడం గమనార్హం.

ఆమె ఒక్కో కేసుకు రోజుకు సగటున రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు (సుప్రీంకోర్టు వెలుపల వాదించే కేసుల్లో) తీసుకుంటారని సుప్రీంకోర్టు న్యాయవాదుల ద్వారా తెలిసింది. అంత పెద్ద మొత్తం తీసుకునే సీనియర్‌ న్యాయవాదిని నియమించుకునే సామర్థ్యం సాధా­రణ చందాదారులైన పిటిషనర్లకు ఉంటుందా? అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. 

చిట్‌ గ్రూపు చందాదారుల తరఫున బుధవారం వాదనలు వినిపించిన మీనాక్షి అరోరా పిటిషనర్ల తరఫున కంటే మార్గదర్శి గురించే ఎక్కువగా వాదించడం విశేషం. మార్గదర్శి చరిత్ర, టర్నోవర్, చందాదారుల వివరాలను నివేదించారు. ఇప్పటివరకు మార్గదర్శిపై చందాదారుల నుంచి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ నిరంతరాయంగా మార్గదర్శిని వేధింపులకు గురి చేస్తున్నాయని చెప్పారు.

సీఐడీ కేసులపై మార్గదర్శి యాజమాన్యం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి స్టే కూడా పొందిందని తెలిపారు. చందా తాలుకూ చెక్కు మొత్తాన్ని 7 రోజుల్లో చెల్లించాల్సి ఉండగా మార్గదర్శి యాజమాన్యం 30 రో­జుల తరువాత చెల్లించిందని, ఇంత చిన్న కారణం­తో చిట్‌ గ్రూపును మూసివేశారని పేర్కొన్నారు. ఎలాంటి నోటీసు, వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వకుండా నేరుగా చిట్‌ గ్రూపు మూసివేత ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు.

ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్య జోక్యం చేసుకుంటూ చిట్‌ గ్రూపు మూసివేత ఉత్తర్వులపై అప్పీల్‌ దాఖలు చేసుకునే ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోకుండా నేరుగా హైకోర్టును ఎలా ఆశ్రయిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నందున నేరుగా హైకోర్టు­ను ఆశ్రయించామని మీనాక్షి అరోరా పేర్కొన్నారు.

ప్రత్యామ్నాయం ఉన్నా నేరుగా హైకోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు తీర్పులున్నాయని చెప్పారు. చిట్‌ గ్రూపుల మూసివేతకు బదులు అధికారులు జరిమానా విధించి వదిలేసి ఉండాల్సిందన్నారు. మీనాక్షి అరోరా వాదనలను ముగించడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను గురు­వారానికి వాయిదా వేశారు. 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)