Breaking News

రెండు ప్రమాదాల్లో ఏడుగురు జల సమాధి

Published on Sun, 07/19/2026 - 02:07

ఎటపాక/ఉయ్యాలవాడ/సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శనివారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం ఏడుగురు నీట మునిగి మృత్యువాత పడ్డారు. పోలవరం జిల్లా ఎటపాక మండలంలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు ప్రమాదవశాత్తూ గోదావరి నదిలో పడి చనిపోగా.. నంద్యాల జిల్లాలో జీవాలు మేపుకునేందుకు వెళ్లి కుందూ నదిలో పడి ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు. వివరాలివీ.. పోలవరం జిల్లా ఎటపాక మండలంలోని గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన 11 మంది గిరిజనులు శనివారం ఉదయం గొల్లగూడెం సమీపాన గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లారు. ఊకే రమేష్‌ (37) నదిలో పడిపోయాడు. 

ఈత రాకపోవటంతో నీటిలో మునిగిపోతుండడంతో బాసి­బోయిన  బాలరాజు (40) అతడిని కాపాడేందుకు యత్నిం­చాడు. ఈ క్రమంలో బాలరాజును రమేష్‌ గట్టిగా పట్టుకోవటంతో ఇద్దరూ మునిగిపోసాగారు. వారితో పాటే వల పట్టుకుని ఉన్న ఊకే లక్ష్మి (37), ఊకే సుశీల (37), తుర్రం భారతి (40) తమ వద్దనున్న చున్నీలు, వలలు విసిరి వారిద్దరినీ కాపాడే ప్రయత్నం చేయగా వీరు కూడా మునిగిపోసాగారు. 

అది గమనించిన మరికొందరు మహిళలు ఆ ఐదుగురినీ కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆ ఐదుగురూ గల్లంతవగా.. ఒడ్డునున్న మహిళలు కేకలు వేయడంతో సమీపంలోని జాలర్లు గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు.కొద్దిసేపటికి ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎటపాక పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తెలంగాణలోని భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతులంద­రూ వ్యవసాయ కూలీలు. వీరిలో నలుగురుకి వివాహం కాగా రమేష్‌ అవివాహితుడు. వారి ఆకస్మిక మృతితో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం అలముకుంది. 

పశువులు మేపుకునేందుకు వెళ్లి.. 
నంద్యాల జిల్లా బోడెమ్మనూరు గ్రామంలో చోటుచేసుకున్న మరో ఘటనలో.. జీవాలను మేపేందుకు వెళ్లిన ఇద్దరు మహిళలు ప్రమాదవశాత్తూ నీట మునిగి మృత్యువాత పడ్డారు. రోజులానే శనివారం ఉదయం పశువులు మేపుకునేందుకు రసూల్‌బీ (38), బీబీ అలియాస్‌ దేవి (50)తో పాటు మౌనిక కుందూ నది ఆవల ఇంజేడు గ్రామ పొలాల్లో మేపుకునేందుకు బయల్దేరారు.

అయితే, నదిలోని నీటి గుంతలోకి మేకలు వెళ్లడంతో రసూల్‌బీ వాటికోసం ఆ గుంతలోకి దిగింది. ఈమె మునిగిపోతుండడాన్ని గమనించిన బీబీ (దేవి) ఆమెను కాపాడేందుకు నీటిలోకి దిగింది. ఇద్దరూ ఊపిరాడక నదిలో గల్లంతయ్యారు. ఒడ్డునున్న మౌనిక జరిగిన విషయాన్ని గ్రామస్తులకు చెప్పగా వారు నదిలో గాలించి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామిరెడ్డి తెలిపారు. మృతులిద్దరూ వరుసకు అత్తాకోడళ్లు.  

వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. 
ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు గిరిజనులు మృత్యువాత పడిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన బృందం చేపలు పట్టేందుకు గోదావరిలోకి వెళ్లగా వీరిలో ఐదుగురు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. 

మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉండటం హృదయవిదారకమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే అండగా నిలిచి, తగిన ఆర్థిక సహాయం అందించాలని వైఎస్‌ జగన్‌ కోరారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)