Breaking News

ఇసుక తవ్వకం ‘ప్రైవేటు’కు ఇద్దాం..

Published on Tue, 10/22/2024 - 06:32

సాక్షి, అమరావతి: ఇసుక కొరత ఇంకా ఉందని, దీన్ని అధిగమించేందుకు రీచ్‌ల్లో తవ్వకం, లోడింగ్‌ ప్రక్రియను ప్రైవేటు ఏజెన్సీలకు కేటాయించే ప్రతిపాదనలతో తన వద్దకు రావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రైవేటు వారికి ఇసుక రీచ్‌లను కేటాయించే వ్యవహారాలను జిల్లా స్థాయి ఇసుక కమిటీలు పారదర్శకంగా పర్యవేక్షించాలని సూచించారు. ఇసుక అందుబాటులో లేని జిల్లాల్లో స్టాక్‌ యార్డులు పెట్టి సరఫరా చేయాలన్నారు. ఉచిత ఇసుకను అందించడం కోసమే సీనరేజి ఛార్జీలను రద్దు చేశామని  చంద్రబాబు తెలిపారు.

 సీనరేజి, జీఎస్టీ రద్దు వల్ల ప్రభుత్వంపై భారం పడినా ఉచిత ఇసుక కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ఆయన గనుల శాఖాధికారులతో ఇసుక సరఫరాపై సమీక్ష నిర్వహించారు. సొంత అవసరాలకు గ్రామ పంచాయతీల పరిధిలో మాత్రమే ట్రాక్టర్లతో ఇసుక తరలింపునకు అ నుమతి ఇచ్చామన్నారు ఇందుకోసం స్థానిక గ్రామ, వార్డు సచివాలయాల్లో తప్పక నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు మార్గాల్లో ఇసుక అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోందని, దాన్ని నివారించడానికి గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముఖే‹Ùకుమార్‌ మీనా, డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

Photos

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం