Breaking News

కీచకపర్వం.. మంగళగిరిలో ఏం జరుగుతోంది?

Published on Sat, 09/14/2024 - 21:12

సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఎక్కడా చూసినా అత్యాచారాలు, హత్యలు, దాడులే కనిపిస్తున్నాయి. మొన్నటి ముచ్చమర్రి ఘటనతో మొదలైన అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక, తాజాగా మంత్రి నారా లోకేష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో ఒక్క రోజులో ముగ్గురు బాలికలపై అత్యాచారయత్నం జరగడం తీవ్ర కలకలం సృష్టించింది.

కాగా, ఈ ఘటనలపై వైఎస్సార్‌సీపీ ట్విట్టర్‌ వేదికగా స్పందించింది. ఈ దారుణాలపై ట్విట్టర్‌లో..‘మంగళగిరిలో ఒక్క రోజులో ముగ్గురు బాలికలపై అత్యాచారయత్నం. నియోజకవర్గంలోని ఆత్మకూరు, మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువు, బాలాజీ నగర్‌లో మైనర్ బాలికలపై అత్యాచారానికి యత్నించారు. 24 గంటల వ్యవధిలో ముగ్గురు బాలికలపై అఘాయిత్యానికి యత్నించడంతో.. భయంతో వణికిపోతున్న ఆడపిల్లల తల్లిదండ్రులు.  నీ రెడ్ బుక్ రాజ్యాంగంలో శాంతి భద్రతను గాలికొదిలేసి.. కామాంధులకి లైసెన్స్ ఇచ్చేశావా నారా లోకేష్‌’ అని ప్రశ్నించింది.

 

ఇదిలా ఉండగా.. ఏపీలో రెడ్‌ బుక్‌ పాలనలో శాంతి భద్రతల అంశం గాలిలో దీపంలా మారింది. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతోందోననే భయంలో ప్రజలు ఉన్నారు. వరుసగా అఘాయిత్యాల ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ముచ్చుమరి ఘటన నుంచి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ దారుణాల వరకు బాధితులకు న్యాయం చేయడంలో కూటమి సర్కార్‌ పూర్తిగా విఫలమైంది.

 ఇది కూడా చదవండి: కూటమి నేతలు గాడిదలు కాస్తున్నారా?: వడ్డే శోభనాద్రీశ్వరరావు

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)