Breaking News

ఏపీలో ఏసీబీ రైడ్స్‌.. వెలుగులోకి సంచలన విషయాలు

Published on Wed, 11/05/2025 - 19:23

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఏసీబీ సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డాక్యుమెంట్ రైటర్స్‌తో కుమ్మక్కై నెలవారీ మామూళ్లకు సబ్ రిజిస్ట్రార్లు తెరలేపారు. ఒంగోలులోని ఓ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నుంచి రూ.30వేల రూపాయల నోట్ల కట్టని సిబ్బంది బయటకి విసిరేశారు.

గతంలో ఏసీబీ అధికారులు వలలో చిక్కిన అధికారులపై ఏసీబీ బృందం స్పెషల్ ఫోకస్ పెట్టింది. 120కి పైగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయలపై దాడులు చేపట్టింది. విశాఖలోని మధురవాడ, గాజువాకలో కొన్ని కీలకమైన విషయాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ అధికారులు దాడులతో పలు చోట్ల తమ కార్యాలయాలకు తాళాలు వేసి డాక్యుమెంట్ రైటర్లు పరారయ్యారు.

లెక్కల్లో చూపని మొత్తం రూ.10,000 నుంచి 75,000 వరకు నగదుని వివిధ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు గుర్తించారు. విశాఖపట్నంలో జగదాంబ సెంటర్‌, పెద్ద గంట్యాడ, మధురవాడ.. విజయనగరంలో భోగాపురం, ఎన్టీఆర్‌ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పల్నాడులో నరసరావుపేట.. ప్రకాశంలో ఒంగోలు, చిత్తూరు రేణిగుంట, కడపలో రాజంపేట.. అనంతపురంలో చిలమత్తూరు, కర్నూలులో ఆళ్లగడ్డ.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. రిజిస్ట్రేషన్‌లో ఉల్లంఘనలు, రిజిస్ట్రేషన్ కోసం పెండింగ్‌లో ఉంచిన పత్రాలను అధికారులు గుర్తించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)