Breaking News

బీచ్‌లో భార్యాభర్తలు రెండు పెగ్గులేసుకునే కల్చర్‌ రావాలి

Published on Sat, 11/15/2025 - 04:57

ఎంవీపీ కాలనీ: రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు నెరెడ్కో నిర్వహించిన ‘వైజాగ్‌ ప్రోపర్టీ ఫెస్ట్‌–2025’లో సంచలన వ్యాఖ్యలు చేశారు. జూదాన్ని ప్రోత్సహించకుండా పర్యాటకం ఎలా అభివృద్ధి చెందుతుందని సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీ తాగడానికి పర్యాటకులెవరైనా విశాఖ బీచ్‌కు వస్తారా? అంటూ ప్రశ్నించారు. విశాఖ బీచ్‌లో భార్యాభర్తలు రెండు పెగ్గులేసుకునే కల్చర్‌ ఉండాలని, భర్త బీచ్‌లో కూర్చుని రెండు పెగ్గులేసుకుంటే భార్య ఐస్‌క్రీం తింటూ ఎంజాయ్‌ చేసేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. 

అవేం లేకుండా ప్రభుత్వం పర్యాటకులను విశాఖ రమ్మంటే ఎందుకొస్తారని ప్ర«శ్నించారు. క్యాసినో, పబ్‌కల్చర్‌ విశాఖలో అభివృద్ధి కావాలంటే లిబరల్‌గా ఉండాలన్నారు. ప్రభుత్వం రిస్ట్రిక్షన్స్‌ పెడితే పర్యాటకం ఎప్పటికీ అభివృద్ధి చెందదని స్పష్టం చేశారు. విశాఖలో ఇవేం లేకపోవడంతోనే ఏపీ, తెలంగాణ పర్యా­టకులు గోవా, శ్రీలంక వంటి ప్రాం­తాలకు తరలి­పోతున్నారన్నారు. ఇటీవల గోవా గవర్నర్‌­ను కలవడానికి వెళ్లినప్పుడు అక్కడి కల్చర్‌ తనను ఎంతగానో ఆకర్షించిందన్నారు. 

రిస్ట్రిక్షన్స్‌ లేని గోవా తరహా పర్యాటక సంస్కృతిని విశాఖలో తీసుకురావాల్సిన అవసరముందని చెప్పారు. ఈ దిశగా కృషి చేయాలని వేదికపై ఉన్న ఎంపీ శ్రీభరత్, మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు సూచించారు. విశాఖలో కొంత కాలంగా రియల్‌ ఎస్టేట్‌ దోపిడీ పెరిగిపోయిందన్నారు. చెరువులు, ప్రభుత్వ భూముల్లో అనధికారిక లే అవుట్‌లు పెద్ద ఎత్తున పుట్టుకొస్తున్నాయన్నారు. వాటి సమాచా­రం ప్రభుత్వం దగ్గర లేకపోతే తాను ఇస్తానన్నారు. 

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)