Breaking News

జత్వానీ ఫోన్, ల్యాప్‌టాప్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపండి

Published on Wed, 10/02/2024 - 05:25

సాక్షి, అమరావతి: తన ఫిర్యాదు ఆధారంగా సినీ నటి జత్వానీపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె నుంచి స్వాదీనం చేసుకున్న మొబైల్‌ ఫోన్, ల్యాప్‌టాప్, ఐపాడ్‌లను ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (ఎఫ్‌ఎస్‌ఎల్‌)కు పంపి పూర్తి స్థాయిలో విశ్లేíÙంచి, సీల్డ్‌ కవర్‌లో నివేదిక ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్‌ హైకోర్టులో మంగళవారం ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు.. దీనిపై లోతుగా విచారణ జరుపుతామని తెలిపింది. 

ఇప్పు­డు అంత సమయం లేనందు­న విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. అప్పటివరకు జత్వానీ ఫోన్లు, ఉపకరణాల్లో డేటా భద్రపరచాలంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఈ మేర­కు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప మంగళవారం ఉత్తర్వులిచ్చారు. విద్యాసాగర్‌ తరఫున టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. జత్వానీ ఫోన్, ఇతర ఎల్రక్టానిక్‌ ఉపకరణాలను తిరిగి ఆమెకిచ్చేందుకు పోలీసులు సిద్ధపడుతున్నారని తెలిపారు. 

వాటిలో చాలా కీలక సమాచారం ఉన్నందున ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపి పూర్తిస్థాయిలో విశ్లేషణ చేయించి, ఆ నివేదికను సీల్డ్‌ కవర్‌లో కోర్టు ముందుంచేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి ఈ అనుబంధ పిటిషన్‌ను వ్యతిరేకించారు. వాటిలోని డేటాను భద్రపరచాలని హైకోర్టు ఇప్పటికే పోలీసులను ఆదేశించిందన్నారు. అనుబంధ పిటిషన్‌ ద్వారా ఈ ఉత్తర్వులను సవరించాలని కోరుతున్నారని తెలిపారు.

రిమాండ్‌పై పిటిషన్‌ విచారణ కూడా 16కి వాయిదా 
జత్వానీ ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో తనను రిమాండ్‌కు పంపుతూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ విద్యాసాగర్‌ దాఖలు చేసిన వ్యాజ్యంలో కూడా న్యాయమూర్తి తదుపరి విచారణను జస్టిస్‌ జ్యోతిర్మయి ఈ నెల 16కి వాయిదా వేశారు. విద్యాసాగర్‌ను కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించాలని కోర్టును పట్టుపట్టవద్దంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను 16 వరకు పొడిగించారు. 

కాంతిరాణా, గున్నీ పిటిషన్లపై విచారణ వాయిదా  
సినీ నటి కాదంబరీ జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ పోలీసు అధికారులు కాంతి రాణా, విశాల్‌ గున్నీ, హనుమంతరావు, సత్యనారాయణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై తదుపరి విచారణ ఈ నెల 3కి వాయిదా పడింది. 

ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఇదే వ్యవహారంలో ముందస్తు బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసిన న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లుకు హైకోర్టు తాత్కాలిక ఊరటనిచ్చింది. ఆయనపై ఈ నెల 3వ తేదీ వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ కృపాసాగర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)