Breaking News

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సెమి క్రిస్మస్ వేడుకలు

Published on Tue, 12/23/2025 - 19:34

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సెమి క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. సెమి క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, అనంతరం  కేక్ కట్ చేసిన మాజీ మంత్రులు తానేటి వనిత, అంబటి రాంబాబు, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్ కుమార్, లేళ్ల అప్పిరెడ్డి, కొమ్మూరి కనకారావు, ఏ. నారాయణమూర్తి, పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు. అనంతరం కార్యకర్తలనుద్దేశంచి పార్టీ నేతలు మాట్లాడారు.

తానేటి వనిత మాట్లాడుతూ.. పేదలను ప్రేమించడంతో పాటు వారికి సహాయం చేయాలన్న ప్రభువు క్రీస్తు సిద్ధాంతాలను కలిగిన నాయకుడు వైఎస్‌ జగన్ అని మాజీ మంత్రి తానేటి వనిత అన్నారు. పేదల పట్ల ప్రేమ ఉన్న నాయకుడు కాబట్టే.. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్థిక వనరులు సహకరించకపోయినా, కరోనా వంటి విపత్తులోనూ ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు.

అంబటి రాంబాబు మాట్లాడుతూ.. క్రిస్మస్‌ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండగ. క్రీస్తు జననానికి మానవాళిలో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఇవాళ 2025లో ఉన్నామంటే.. దాని కొలమానం క్రీస్తు శకం అని అంటాం. అంటే ఆయన ఉద్భవించిన నాటి నుంచి నేటికి 2500 సంవత్సరాలు కింద లెక్క. ఆ విధంగా మానవాళి తమ రోజులు లెక్కించుకోవడానికి గుర్తించబడిన.. క్రీస్తు జననం అంటే ఎంత పవిత్రమైనదో, గొప్పదో తెలుసుకోవచ్చు.

మన దేశం లౌకిక వాద దేశం. ఇక్కడ సర్వమతాలు సహజీవనం చేస్తున్న దేశం. ఎవరైనా పరమతాన్ని గౌరవిస్తే.. అప్పుడే మన మతాన్ని గౌరవించగలుగుతాం. అన్ని మతాలు సహజీవనం చేస్తున్న చక్కని దేశం మనది. గుంటూరుకు సంబంధించి చాలా కాలం క్రితమే క్రిస్టియానిటీ మొదట విద్యాలయాలు, వైద్యాలయాలను తీసుకొచ్చింది. మానవ సేవ చేయడమే దైవ సేవ చేయడంగా భావించిన క్రిస్టియానిటీ అనేక కార్యక్రమాలు చేసింది. వైఎస్సార్‌సీపీ తరపున రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఏసు ప్రభువు భౌతికంగా మన మధ్య లేకపోయినా... సమాజానికి సంబంధించి ఆయన బోధనలు, ఆశయాలు మనందరి హృదయాల్లో చిరస్ధాయిగా ఉంటాయి. తోటివారిని ప్రేమించడం, మనకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేయడం, అవసరమైన చోట్ల త్యాగాలకు సిద్ధం కావడం ఇలా బైబిల్ లో అంశాలన్నీ మన కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. మనిషి ప్రతి మాటలో మానవత్వం, ప్రేమ ఉండాలి, ప్రతి పనిలో సాయం చేసే గుణం ఉండాలి. ఈ లక్షణాలన్నింటినీ సమాజంలో ముందుకు తీసుకువెళ్లే క్రమంలో మన ప్రియతమ నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ నేతృత్వంలో మనందరం సమాజంలో అన్ని మతాలను గౌరవిస్తూ.. అన్ని మతాల మధ్య సమతుల్యత పాటిస్తూ మందుకు సాగాలని,  ఆ ప్రభువు ఏసుక్రీస్తు చెప్పినట్లు కోరుకుంటున్నాను

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)