Breaking News

జోన్‌ల వారీగా ‘సదరం’ స్లాట్‌ బుకింగ్‌

Published on Mon, 07/06/2026 - 05:59

సాక్షి, అమరావతి: ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌–2026లోని జోన్‌ల వారీగా సదరం స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఆరు జోన్‌లుగా సదరం స్లాట్స్‌ను విడుదల చేయనుంది. ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. విద్య, ఉద్యోగం, ఉపాధి, ఇతర కారణాలతో సొంత జిల్లాలకు దూరంగా ఉన్నవారు సైతం సులభంగా సదరం స్లాట్స్‌ పొందేలా గత ప్రభుత్వంలో రాష్ట్రం యూనిట్‌గా స్లాట్స్‌ జారీ ప్రక్రియను ప్రారంభించారు. సొంత జిల్లాల్లో స్లాట్‌ దక్కనివారు పక్క జిల్లాల్లో స్లాట్‌ పొందే వీలు కల్పించారు. ఇప్పుడు ఆ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, జోన్‌ విధానంలో స్లాట్స్‌ విడుదల చేయనున్నారు. దీంతో ఉపాధి, ఉద్యోగం, ఇతర కారణాలతో సొంత జిల్లాలు వీడి దూర ప్రాంతాల్లో జీవనం సాగించే వారికి ఇక్కట్లు తప్పవు. ఉదాహరణకు

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా 
నుంచి వేల మంది విజయవాడలో జీవనం సాగిస్తుంటారు. నూతన నిబంధనల ప్రకారం ఇలాంటి వారు తమ సొంత జిల్లా లేదా పక్క జిల్లాల్లో మాత్రమే సదరం స్క్రీనింగ్‌కు అర్హులు అవుతారు. విజయవాడలో స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవడం సాధ్యం కాదు. గతంలో ఏ జిల్లాలోని ఆస్పత్రుల్లో అయినా స్లాట్‌ పొంది, వైకల్య ధ్రువీకరణపత్రాలు పొందే వీలుండేది. ఇప్పు డా ప్రక్రియను రద్దు చేసి, ఆరు జోన్‌లుగా చంద్రబాబు ప్రభుత్వం సదరం స్లాట్స్‌ను విడుదల చేయనుంది. అదేవిధంగా వెయిటింగ్‌ లిస్ట్‌ విధానాన్ని కూడా రద్దు చేసింది. దీంతో వివిధ ప్రాంతాలకు వలస వచ్చిన దివ్యాంగులకు తిప్పలు తప్పవు. 

8 నుంచి సదరం స్లాట్‌ బుకింగ్‌
జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలకు సంబంధించిన స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియ ఈ నెల 8న ప్రారంభం కానుంది. స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి 13 నుంచి ఆస్పత్రుల్లో స్క్రీనింగ్‌ నిర్వహించనున్నారు. స్లాట్‌ బుకింగ్‌ సమయంలో సెల్ఫ్‌ డిక్లరేషన్‌ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ మేరకు సదరం పోర్టల్‌లో మార్పులు కూడా చేశామని సెకండరీ హెల్త్‌ డైరెక్టర్‌ చక్రధర్‌బాబు తెలిపారు. సమీప గ్రామ, వార్డు సచివాలయం లేదా ఏపీ సేవా పోర్టల్‌లో సిటిజన్‌ లాగిన్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఆరు జోన్లలోని జిల్లాలు ఇలా...
జోన్‌–1:     శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం
జోన్‌–2:     అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ,  డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
జోన్‌–3:     పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పోలవరం 
జోన్‌–4:     గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
జోన్‌–5:     తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్‌ కడప
జోన్‌–6:     నంద్యాల, అనంతపురం, కర్నూలు,  శ్రీ సత్యసాయి  

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)