Breaking News

పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో దారుణం..

Published on Tue, 12/02/2025 - 19:45

సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ సెక్యూరిటీ గార్డు డాక్టర్‌ అవతారం ఎత్తాడు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డే డాక్టర్‌గా వైద్యం చేయడంతో రోగులు, వారి కుటుంబసభ్యులు విస్తుపోతున్నారు. పోస్ట్ మార్టం చేసిన మృతదేహాలకు కుట్లు వేయడంతో పాటు గాయాలతో వచ్చిన రోగులకు సెక్యూరిటీ గార్డ్  చికిత్స చేస్తున్నాడు.  గేటు బయట కాపలాగా ఉండాల్సిన గార్డ్ వైద్యం చేయడంతో రోగులు భయాందోళనకు గురవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి.

వైద్యులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గేటు బయట కాపలా కాయాల్సిన సెక్యూరిటీ గార్డుతో రోగులకు వైద్యం చేయిస్తున్నారు. ఇటీవల ఈ సీహెచ్‌సీలో వైద్యుల నిర్లక్ష్యంతో ఒక నిండు గర్భిణి ప్రాణాలు పోయాయంటూ బాధితులు ఆందోళన చేశారు. దీనిపై విచారణ జరిపి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సరెండర్‌ చేసినా... ఆస్పత్రి వర్గాల్లో ఏ మార్పూ కనిపించడం లేదు. వైద్యులు కబుర్లతో కాలక్షేపం చేస్తుంటే... కాపలా కాయాల్సిన సెక్యూరిటీ గార్డు వైద్య సేవలు అందిస్తున్నాడు. 

అంతేకాకుండా వైద్యులు, శిక్షణ పొందిన తోటీలు చేయాల్సిన పోస్టుమార్టం ప్రక్రియను కూడా ఆ సెక్యూరిటీ గార్డుతోనే చేయిస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళ గాయాలు, ఇతర అనారోగ్య సమస్యలతో వస్తే వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. ఆ సమయంలో సెక్యూరిటీ గార్డే వైద్యసేవలు అందిస్తున్నారు. గాయాలకు కుట్లు వేయడం వంటివి చేస్తున్నారు. దీంతో రోగులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 

ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో వేలాది మంది రోగులకు వైద్యసేవలు అందించాల్సిన ఆస్పత్రిలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో దిగజారిన ప్రభుత్వ వైద్యసేవలకు ఈ ఆస్పత్రి ఒక నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కీర్తిప్రియను ‘సాక్షి’ వివరణ కోరగా... తమ ఆస్పత్రిలో తోటీలు లేనందున సెక్యూరిటీ గార్డుతో పోస్టుమార్టం విధులు చేయిస్తున్నట్లు తెలిపారు.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)