Breaking News

గుండెపోటుతో సచివాలయ ఉద్యోగి మృతి

Published on Wed, 01/14/2026 - 05:03

ఆరిలోవ (విశాఖ): విశాఖలోని ఆరిలోవ ప్రాంతంలో విధుల్లో ఉన్న సచివాలయ ఉద్యోగి గుండెపోటుతో మంగళవారం ఆకస్మికంగా మృతి చెందారు. సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. జీవీఎంసీ 13వ వార్డు పరిధి ఆరిలోవ కాలనీలోని 9వ నంబర్‌ సచివా­లయంలో సుంకర ఉదయ్‌కుమార్‌(40) టౌన్‌ ప్లానింగ్‌ సెక్రటరీగా పనిచేస్తున్నారు. సింహాచలం ప్రాంతానికి చెందిన ఆయన మంగళవారం ఉదయం విధులకు హాజరయ్యారు. ప్రత్యక్ష విధులతో పాటు తూర్పు జోన్‌ జెడ్సీ శివప్రసాద్‌ నిర్వహించిన కాన్ఫరెన్స్‌ కాల్‌లో పాల్గొన్నారు.

సంక్రాంతి మూడు రోజుల అనంతరం ఈ నెల 17న అందరూ తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని కలెక్టర్‌ సూచించినట్టు జెడ్సీ శివప్రసాద్‌ తెలిపారు. అప్పగించిన పని తప్పకుడా చేయాల్సిందేనని, సరిగా పనిచేయనివారి గురించి క్లస్టర్ల వారీగా రిపోర్టు తీసుకొని చర్యలు చేపడతామని హెచ్చరిచారు. ఆ ఫోన్‌ కాల్‌ కాన్ఫరెన్స్‌ ముగిసిన వెంటనే ఆరిలోవ ప్రాంతంలో జెడ్సీ శివప్రసాద్‌ పర్యటనకు వస్తారని తెలిసి తోటి సిబ్బందితో కలసి ఆయన ముడసర్లోవ పార్కు సమీపంలో నిరీక్షిస్తున్న ఉదయ్‌కుమార్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

తోటి సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు గండెపోటుతో మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో సిబ్బంది కన్నీటిపర్యంతమయ్యారు. విష­యం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకుని బోరున విలపించారు. సంక్రాంతి జరుపుకోవాల్సిన ఇంట్లో విషాదం నింపావంటూ కుటుంబ సభ్యులు రోదన వర్ణనాతీతం.

పని ఒత్తిడే కారణం
ఉదయ్‌కుమార్‌ గుండెపోటుతో మృతి చెందడానికి చంద్రబాబు ప్రభుత్వం పెడుతున ఒత్తిడే కారణమని తోటి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊపిరి తీసుకోలేనంతగా పని ఒత్తిడి పెంచారని వాపోయారు. బీపీఎల్, ఎల్‌ఆర్‌ఎస్, మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లు, టౌన్‌ ప్లానింగ్‌ స్కీం వంటి పనులతో నిత్యం ఒత్తిడి ఉంటోందని చెప్పారు. దీంతోపాటు సచివాలయం సర్వేలు, ఎన్నికల వర్క్, సెలవు రోజుల్లో కూడా ఉదయం నుంచి రాత్రి వరకు అధికారుల ఫోన్‌ కాన్ఫరెన్స్‌లు, అన్నీ పనులకూ ఒకేసారి టార్గెట్‌ ఇచ్చి సమయానికి పూర్తిచేయాలని, లేదంటే మెమోలు ఇవ్వడం చేస్తున్నారని తోటి సిబ్బంది వాపోయారు. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)