Breaking News

గుండ్లకమ్మ రెండో గేటు స్థానంలో స్టాప్‌లాగ్‌ గేటు 

Published on Mon, 12/11/2023 - 05:04

సాక్షి, అమరావతి: టీడీపీ సర్కార్‌ అవినీతి, నిర్వ­హణ లోపంతో తుప్పుపట్టి వరద ఉధృతికి కొట్టుకు­పోయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు స్థానంలో అధికారులు సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ఆదివారం హుటాహుటిన స్టాప్‌లాగ్‌ గేటును ఏర్పా­టు­చేశారు. దీంతో ప్రాజెక్టులో 0.75 టీఎంసీలు కడలిపాలు కాకుండా అడ్డుకట్ట వేశారు. ప్రాజెక్టులో 1.1 టీఎంసీల  నిల్వకు మార్గం సుగమం చేశారు. 

నీరు నిల్వ ఉన్నా.. వరద కొనసాగుతున్నా..
మిచాంగ్‌ తుపాను ప్రభావంవల్ల ప్రకాశం జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలతో గుండ్లకమ్మ వరదెత్తింది. ఈ ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరగడంతో అప్పటికే తుప్పుపట్టిన రెండో గేటు  8న కొట్టుకుపోయింది. నిజానికి.. ఇలా కొట్టుకుపోయిన గేటు స్థానంలో స్టాప్‌లాగ్‌ గేటు ఏర్పాటుచేయాలంటే సాధారణంగా ప్రాజెక్టులో నీటిని ఖాళీచేస్తారు.

డెడ్‌ స్టోరేజీ స్థాయికి నీటినిల్వ చేరాక.. వరద ప్రవాహం తగ్గాక స్టాప్‌లాగ్‌ గేటును ఏర్పాటుచేస్తారు. కానీ..  ప్రాజెక్టులో నీరునిల్వ ఉన్నా.. వరద  కొనసాగుతున్నా.. సీఈ మురళీనాథ్‌రెడ్డి సారథ్యంలో అధికారులు శ్రమించి కొట్టుకుపోయిన రెండో గేటు స్థానంలో ఒక్కో ఎలిమెంట్‌ను దించుతూ స్టాప్‌లాగ్‌ గేటును విజయవంతంగా ఏర్పాటుచేశారు.  

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)