Breaking News

ఎన్నికలకు టైం లేదు!

Published on Thu, 03/25/2021 - 03:31

సాక్షి, అమరావతి: తన హయాంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను జరిపే పరిస్థితి లేదని, కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా దీనికి కారణమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ప్రకటించారు. ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేయనున్న తనకు ఈ ఎన్నికలు నిర్వహించేందుకు తగినంత సమయం లేదన్నారు. ఈ మేరకు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ పేరుతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది క్రితం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినప్పుడు సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం.. తిరిగి ఎన్నికలు నిర్వహించేటప్పుడు ప్రభుత్వంతో సంప్రదింపుల తర్వాతే  కొత్త తేదీలను ఖరారు చేయాలని, పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు నుంచి ఎన్నికల కోడ్‌ అమలు చేయాలని సూచించిందని నిమ్మగడ్డ అందులో పేర్కొన్నారు. ఎన్నికలకు  నాలుగు వారాల ముందు కోడ్‌ అమలు చేయడం ద్వారా పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికలను నిర్వహించానని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విషయంలోనూ ఇదే విధానం అమలు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఆ బాధ్యత తదుపరి ఎస్‌ఈసీదే 
నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్‌ అమలు చేయాల్సి ఉండటం, పోలింగ్‌ సిబ్బందిని కోవిడ్‌ వారియర్స్‌గా గుర్తించి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడం, మరోవైపు తన పదవీ కాలం ఈ నెలాఖరు (మార్చి 31వ తేదీ)తో ముగుస్తున్న కారణంగా వాయిదా పడిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు షెడ్యూల్‌ ప్రకటించలేకపోతున్నట్లు నిమ్మగడ్డ పేర్కొన్నారు. తన తదుపరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టేవారు ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యత తీసుకుంటారని ఉత్తర్వుల్లో  పేర్కొన్నారు. 

నిన్న అలా.. నేడు ఇలా
దాదాపు నెలన్నర క్రితం కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేవరకైనా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరినా నిమ్మగడ్డ నిరాకరించారు. ఎన్ని అవాంతరాలు తలెత్తినా తక్షణమే ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలను నిమ్మగడ్డ ప్రారంభించిన విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సినేషన్‌ పెద్ద ఎత్తున సాగుతున్న సమయంలో అలా మొండిగా వ్యవహరించిన నిమ్మగడ్డ ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించలేకపోవడానికి అదే వ్యాక్సినేషన్‌ను సాకుగా చూపుతుండటం పట్ల అధికార, రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. 

Videos

చైనాకు దగ్గరవుతోన్న భారత్? టిక్ టాక్ రీ ఎంట్రీ.. నిషేధంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

7 కోట్ల స్థలం 50 లక్షలకే.. ఆంధ్రజ్యోతికి ఇవ్వాలనుకొని బొక్క బోర్లాపడ్డ టీడీపీ

పాఠశాలలో పిల్ల ఏనుగు

కుక్కలతో మాట్లాడుతున్న రాజేష్

ఎన్టీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు.. నారా రోహిత్ షాకింగ్ రియాక్షన్

అరుణ నోరు తెరిస్తే బండారం బయటపడుతుందని హోంమంత్రి అనితకు భయం

అమెరికా వీసా ఇమ్మిగ్రేషన్ విధానాలు మరింత కఠినతరం

జేమ్స్ కామెరాన్ చేతిలో SSMB29 ప్రమోషన్స్

అమెరికాలోని పెంబ్రోక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

అబ్బయ్య చౌదరిని చంపితే? వెయ్యి మంది అబ్బయ్య చౌదరిలు వస్తారు.. పేర్ని నాని సంచలన కామెంట్స్

Photos

+5

తెలంగాణ : ప్రసిద్ద వెంకటేశ్వర ఆలయం రత్నాలయం.. తప్పక వెళ్లాల్సిందే (ఫొటోలు)

+5

ప్రభాస్ ఫస్ట్‌ హీరోయిన్‌ శ్రీదేవి విజయ్ కుమార్ (ఫోటోలు)

+5

జర్మనీ : గుమ్మడికాయల ప్రదర్శన అదరహో (ఫొటోలు)

+5

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఘనంగా వరలక్ష్మీ వత్రాలు (ఫొటోలు)

+5

జపాన్‌లో చిల్ అవుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

పద్మనాభస్వామి ఆలయ వేడుకలో మోహన్ లాల్ (ఫొటోలు)

+5

శ్రీవారితో అందమైన జర్నీకి ఏడాది! వరాహరూపం సింగర్‌ శ్రీలలిత (ఫొటోలు)

+5

'మన శంకరవరప్రసాద్ గారు' టైటిల్‌ గ్లింప్స్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ట్రెండింగ్‌ ఫోటోలు చూశారా..?

+5

#HBDChiranjeevi : 70 ఏళ్ల గాడ్‌ ఫాదర్‌.. 'చిరంజీవి' బర్త్‌డే స్పెషల్‌ (ఫోటోలు)