Breaking News

విజయవాడలో సీ ఫుడ్‌ ఫెస్టివల్‌

Published on Sat, 07/15/2023 - 04:23

సాక్షి, అమరావతి:  స్థానిక వినియోగాన్ని పెంచడం, ప్రత్యా­­మ్నాయ మార్కెటింగ్‌ సౌకర్యాల కల్పనే లక్ష్యంగా విజయవాడలో 28వ తేదీ నుంచి మూడు రోజుల పాటు సీ ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్‌ కూనపురెడ్డి కన్నబాబు తెలిపారు. సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏటా 50 లక్షల టన్నుల మత్స్య సంపద ఉత్పత్తితో దేశంలోనే నం.1 స్థానంలో ఉన్న రాష్ట్రంలో స్థానిక వినియోగం 8 శాతానికి మించడం లేదన్నారు. దేశ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో 75 శాతం మన రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతు­న్నా­యన్నారు. కానీ వినియోగం మాత్రం 5 శాతం లోపే ఉందని చెప్పారు.

మిగిలిన  రొయ్య అంతా ఎగు­మతి అ­వు­తోందన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకు­లు ఎదురైతే రాష్ట్రంలోని రొయ్య రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోందని తెలిపారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే డొమెస్టిక్‌ మార్కెట్‌ను పెంచుకో­వాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రంలో సీ ఫుడ్‌ వినియోగదా­రులు పెద్ద ఎత్తున ఉన్నా.. డిమాండ్‌కు తగ్గట్టుగా రిటైల్‌ షాపులు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారిందన్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ‘ఫిష్‌ ఆంధ్రా’ బ్రాండ్‌తో స్థానిక వినియోగం పెంచేలా ఆక్వా హబ్స్‌ అండ్‌ స్పోక్‌ విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే 1,500 అవుట్‌ లెట్స్‌ను ఏ­ర్పాటు చేయగా.. 15 హబ్స్‌ నిర్మాణంలో ఉన్నట్టు చెప్పా­­రు. మ­రిన్ని హబ్స్, అవుట్‌ లెట్స్‌ ఏర్పాటుకు ముందుకొచ్చే ఔత్సా­హికులను ప్రోత్సహించడం, వినియోగదారు­ల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ సీ ఫుడ్‌ ఫెస్టివల్‌­ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

మూడు రోజుల పాటు నిర్వ­­హించే ఫెస్టివల్‌లో 20 వేల మంది సందర్శకులు వ­స్తా­­రని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఫెస్టివల్‌లో రో­జూ రూ.699తో అపరిమితమైన సీ ఫుడ్‌ బఫెట్‌ను అందిస్తు­న్నా­మన్నారు. సీ ఫుడ్‌పై వంటల పోటీలు, వైద్యులు, పో­షకాహార నిపుణులతో సెమినార్లు, 2కే రన్‌ నిర్వహంచనున్నట్టు తెలిపారు. ఇలాంటి సీ ఫుడ్‌ ఫెస్టివల్స్‌ విశాఖ, కాకినాడ, భీమవరం, నెల్లూరు తదితర ప్రాంతాలతో పా­టు హైద­రాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోనూ నిర్వ­హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా ఫెస్టివల్‌ బ్రోచర్‌ను కమిషనర్‌ కన్నబాబు విడుదల చేశారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)