Breaking News

ఇవ్వాల్సింది రూ.1,200 కోట్లు.. ఇస్తున్నది రూ.56 కోట్లు!

Published on Sat, 10/25/2025 - 05:17

సాక్షి, అమరావతి:  కూటమి సర్కారు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను మరోమారు దగా చేసింది. పెద్ద కంపెనీలపై అపారమైన ప్రేమను కనబరుస్తూ బడుగు, బలహీనవర్గాల యూనిట్లకు శఠగోపం పెట్టింది. పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదలలో అయినవారికి కంచాల్లో పెట్టి.. బడుగు బలహీనవర్గాల వారికి చేతులు విదిల్చిన చందంగా నిధులు కేటాయించింది. రూ.1,500 కోట్ల పారిశ్రామిక రాయితీలు విడుదల చేస్తున్నామంటూ ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేవలం రూ.1,030.95 కోట్లకు మాత్రమే ఉత్తర్వులు జారీచేశారు. 

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు చెల్లించాల్సిన సుమారు రూ.1,200 కోట్ల పారిశ్రామిక రాయితీలకు కేవలం రూ.56 కోట్లు మాత్రమే విడుదల చేశారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు రగిలిపోతున్నారు. వాస్తవంగా పరిశ్రమలకు రూ.11 వేలకోట్లకు పైగా ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉండగా అందులో 10 శాతం మాత్రమే.. అది కూడా విశాఖ పెట్టుబడుల సదస్సు ముందు తూతూమంత్రంగా ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే పాత బకాయిలతోపాటు ఏ ఏడాది బకాయిలు ఆఏడాదే చెల్లిస్తామని, ఇందుకోసం ఎస్క్రో అకౌంట్‌ ఓపెన్‌ చేస్తున్నామంటూ చెప్పి ఇప్పుడు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పరిశ్రమలశాఖ మంత్రి టి.జి.భరత్, ఎంఎస్‌ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ విజయవాడలో సంయుక్తంగా సమావేశం పెట్టి మే 15 కల్లా రూ.5 వేలకోట్ల రాయితీలు విడుదల చేస్తామని హా­మీ ఇచ్చారని, ఇప్పుడేమో సీఎం రూ.1,500 కోట్లు అని చెప్పి.. అందులో మళ్లీ రూ.430 కోట్లు కోత పెడితే ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా నమ్మాలంటూ చిన్న, బడుగు పారిశ్రామికవేత్తలు నిలదీస్తున్నారు.

నూరుశాతం చెల్లించకపోతే రేపటి నుంచి నిరసన 
పారిశ్రామిక పాలసీల కోసం మార్గదర్శకాలు అంటూ కొత్త నిబంధనలను తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక రాయితీల్లో కోత విధించడంపై వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విడుదల చేస్తున్న మొత్తం పారిశ్రామిక రాయితీ రూ.1,030.95 కోట్లలో లార్జ్‌ అండ్‌ మెగా పరిశ్రమలకు రూ.694.44 కోట్లు, ఎంఎస్‌ఎంఈలకు కేవలం రూ.275.47 కోట్లు, ఎస్సీ, ఎస్టీలకు రూ.56 కోట్లు కేటాయించారంటే చిన్న పరిశ్రమలు, ఎస్సీ, ఎస్టీల పరిశ్రమలపై ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తోందని మండిపడుతున్నారు. 

ఎస్సీ, ఎస్టీలకు ఉన్న బకాయిల్లో ఇప్పుడు కేవలం 20 శాతం మాత్రమే చెల్లించడాన్ని వీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ శుభమ్‌ బన్సాల్‌ను కలిసి రాయితీలను పూర్తిగా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. శనివారంలోగా నూరుశాతం రాయితీలను విడుదల చేయకపోతే సోమవారం నుంచి నిరసన కార్యక్రమాలను చేపడతామని ఎస్టీ పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)