Breaking News

అంతర్‌ జిల్లాల బదిలీలకు షెడ్యూల్‌

Published on Thu, 08/21/2025 - 05:58

సాక్షి, అమరావతి: ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు జీవిత భాగస్వామి (స్పౌజ్‌), పరస్పర (మ్యూచువల్‌) అంతర్‌ జిల్లా బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలతో కూడిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్‌ స్కూళ్లల్లో పనిచేస్తూ ఈ ఏడాది జూలై 31 నాటికి రెండేళ్ల సర్వీసు ఉన్నవారికి మాత్రమే అవకాశం కల్పించారు. 

దరఖాస్తుదారులు ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా, బదిలీ కోరుకుంటున్న జిల్లా వివరాలకు సంబంధించి రెండు రకాల ఫార్మాట్లలో గురువారం నుంచి ఈ నెల 24లోగా ఉపాధ్యాయులు లీప్‌ యాప్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తులు సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు ఆదేశించారు.  దరఖాస్తుల ప్రింట్‌ కాపీలను స్థానిక ఎంఈవోలకు అందించాలని, వీటిపై డీఈవో పరిశీలన చేసి ఈనెల 27 నాటికి డైరెక్టరేట్‌కు పంపించాలన్నారు. 

మ్యూచువల్, స్పౌజ్‌ కేటగిరీ ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా 2 వేల మంది వరకు ఉండవచ్చని అంచనా. తాజా బదిలీల్లో మెడికల్‌ గ్రౌండ్స్‌ కింద అవకాశం ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. వ్యక్తిగతం, మెడికల్‌ గ్రౌండ్స్‌ కింద కూడా అంతర్‌ జిల్లా బదిలీలకు అనుమతించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. అలాగే, మిగులు ఉపాధ్యాయులకు సైతం అంతర్‌ జిల్లా బదిలీలు చేపట్టాలని కోరుతున్నారు.    

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)