Breaking News

నేడు, రేపు వానలు

Published on Fri, 04/11/2025 - 04:51

సాక్షి, విశాఖపట్నం/తిరుపతి రూరల్‌/: పశ్చిమ మధ్య, నైరు­తి బంగాళాఖాతంలో అ­ల్ప­పీడనం కొనసాగుతోంది. ఇది గురువారం అర్ధరాత్రి  పశ్చి­­­మ మధ్య బంగాళా­ఖాతం వైపుగా కదిలే అవకా­శం ఉంది. మరోవైపు.. పశ్చి­మ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు వరకూ విస్తరించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మరో 2 రోజులపాటు వర్షాల ప్రభా­వం అక్కడక్కడా ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 

అల్పపీడనం కారణంగా.. నేడు, రేపు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలు­చోట్ల వర్షాలుపడే సూచనలున్నాయని తెలి­పారు. గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, కోస్తాంధ్ర మత్స్యకారులు శుక్రవారం వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. 

ప్రకాశం జిల్లాలో బొప్పాయి తోటలకు తీవ్ర నష్టం 
గురువారం కురిసిన వర్షాలకు ప్రకాశం జిల్లా కురిచేడు, మర్రిపూడి, గిద్దలూరు, పామూ­రు, దర్శి, పొదిలి మండలాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దర్శి మండ­లం చందలూ­రు, వెంకటచలంపల్లి, మారెడ్డిపల్లి, బసి­రెడ్డిపల్లి, అబ్బాయిపాలెం, మల్లవరం, చిదంబరంపల్లి, గొల్లపల్లి, కుంచేపల్లి పాములపాడు గ్రామా­ల్లో బొప్పాయి తోటలకు తీవ్ర­నష్టం వాటిల్లింది. మిరప, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. తిరుపతి రూరల్, చంద్రగిరి, రామచంద్రాపురం మండలాల్లో భారీ వర్షం కురిసింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)