Breaking News

వామ్మో.. ఘాట్‌ రహదారి

Published on Sun, 12/14/2025 - 12:29

తాడిపత్రి టౌన్‌: నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆలూరు కోన రంగనాథ స్వామి క్షేత్రానికి వెళ్లే ఘాట్‌ రహదారి ప్రమాదకరంగా మారింది. ఘాట్‌ రోడ్డుకు ఉన్న రక్షణ గోడ కొన్ని చోట్ల దెబ్బతినగా.. మరి కొన్ని చోట పూర్తిగా నేలవాలింది. యాత్రికులు, భక్తులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. వాహనాల్లో ఘాట్‌ రోడ్డులో ప్రయాణించేందుకు జంకుతున్నారు. 

తాడిపత్రి పట్టణం నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలూరు కోన క్షేత్రం.. ప్రకృతి రమణీయతతో శోభాయమానంగా వెలుగొందుతోంది. క్షేత్రంలో స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేత శేషతల్పంపై భక్తులకు దర్శనం ఇస్తారు. ఏటా వైశాఖ మాసంలో స్వామికి బ్రహోత్సవాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ప్రతి శని, ఆదివారాల్లో ఆలూరు కోనకు పెద్ద ఎత్తున పర్యాటకులు విచ్చేసి జలపాతంలో సేదతీరుతారు. 

ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ ఆలయానికి వెళ్లే రోడ్డు మాత్రం అధ్వానంగా మారింది. రోడ్డుపై మోకాలు లోతు గోతులు పడటంతో భక్తులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. అలాగే ఘాట్‌ రోడ్డులో కొండకు ఒక వైపు రక్షణ గోడ కూలిపోయింది. మరోవైపు రక్షణ గోడ ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు, పర్యాటకులు భయపడుతూ ఆలయానికి చేరుకుంటున్నారు. ఏవైనా పెద్ద ప్రమాదాలు జరగక ముందే అధికారులు మేల్కొని చర్యలు  తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.  

రోడ్డు గుంతలమయం..
తాడిపత్రి నియోజకవర్గంలో ఆలూరు కోన రంగనాయకుల స్వామి దర్శనానికి రోజూ పెద్ద ఎత్తున భక్తులు వెళ్తారు. కోనకు వెళ్లే ఘాట్‌ రోడ్డు ప్రమాదకరంగా మారింది. రక్షణ గోడ కూలిపోగా.. కొండకు మరో వైపు రక్షణగోడ లేకుండానే రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. రోడ్డు కూడా గుంతలమయంగా మారింది. కొన్ని చోట్ల పూర్తిగా   దెబ్బతింది. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని రోడ్డుకు      మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది.        – యోగేశ్వర రెడ్డి, పర్యాటకుడు, తాడిపత్రి  

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)