Breaking News

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు నష్టపోకుండా పదోన్నతులు 

Published on Fri, 07/07/2023 - 04:49

సాక్షి, అమరావతి : ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు చేయడంతోపా­టు, ఇప్పటికే వారికి కేటాయించిన సంఖ్య కంటే ఎ­క్కువ సంఖ్యలో పదోన్నతులు పొందిన వారికి నష్టం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

అధిక సంఖ్యలో పదోన్నతులు పొందిన వారికి డిమోషన్‌ ఇవ్వకుండా, సూపర్‌ న్యూమరరీ పోస్టులు సృష్టించి.. అదే స్థానాల్లో కొనసాగించే దిశగా కసరత్తు చేస్తోంది. పదోన్నతులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల నేపథ్యంలో ఉద్యోగులు ఎవరికీ నష్టంలేకుండా అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తోంది. అందుకు అనుగుణంగా సలహా మండలిని ఏర్పాటు చేసింది. వాస్తవ లెక్కలు తేల్చడం ద్వారా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు నష్టపోకుండా చర్యలు చేపట్టనుంది.        

♦ ప్రమోషన్లలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్‌ అమలుపై ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని విభాగాల్లోని అన్ని కేటగిరీల పోస్టులకు తగిన ప్రాతినిధ్యం ఉండేలా పదోన్నతిలో రిజర్వేషన్లు అమలు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ 2003 ఫిబ్రవరి 14న జీవో నంబర్‌ 5 జారీ చేసింది. 

♦రిజర్వేషన్‌ ఉపయోగించుకొని ప్రమోషన్‌ పొందిన తర్వాత నుంచి ప్రమోషన్‌ పోస్టు సీనియారి­టీ గణించి తదుపరి ప్రమోషన్‌ ఇవ్వడానికి అ­వ­కాశం కలి్పంచే ‘కాన్సిక్వెన్షియల్‌ సీనియారిటీ’ని అమలు చేస్తూ 2009 ఫిబ్రవరి 20న సాంఘిక సంక్షేమ శాఖ జీవో నంబర్‌–26 జారీ చేసింది. 

♦ కాన్సిక్వెన్సియల్‌ సీనియారిటీ వల్ల ఎస్సీ, ఎస్టీలకు న్యాయంగా దక్కాల్సిన ప్రాతినిధ్యం (ఎస్సీ–15 శాతం, ఎస్టీ–6శాతం) కంటే ఎక్కువ మంది ప్రమోషన్లు పొందారని, ఫలితంగా మిగతా ఉద్యోగులు నష్టపోతున్నారని సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో వేసిన కేసుల్లో వారికి అనుకూలంగా తీర్పులు వచ్చాయి.

జీవో–26ను రద్దు చేసి, వాస్తవంగా ఎస్సీ, ఎస్టీలు కేటాయించిన పోస్టులకు మించి ప్రమోషన్లు పొందిన వారి సంఖ్యను గణించి, మిగతా వారికీ న్యాయం చేయాలని తీర్పులు చెప్పాయి. ఈ నేపథ్యంలో సలహా కమిటీ సిఫార్సుల మేరకు అడుగులు ముందుకు వేయనుంది. 

పోస్టులెన్ని? ఎంత మంది ఉన్నారు? 
తెలంగాణ రాష్ట్రం కూడా సలహా కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ప్యానెల్‌లను సమీక్షించడానికి కసరత్తు చేపట్టింది. ఆ కమిటీ సిఫార్సుల ఆధారంగా.. ఎస్సీ, ఎస్టీలు కేటాయించిన పోస్టుల కంటే ఎక్కువగా ఉన్న వారి కోసం సూపర్‌ న్యూమరీ పోస్టులు సృష్టించాలని నిర్ణయించింది.

ఫలితంగా వారిని ఉన్న ఉద్యోగాల్లోనే తెలంగాణ ప్రభుత్వం కొనసాగించింది. అడిషనల్‌ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, అసిస్టెంట్‌ సెక్రటరీ కేటగిరీలుగా ఐదు సూపర్‌ న్యూమరీ పోస్టులు, 30 నోషనల్‌ ప్రమోషన్‌లను అనుమతించింది. ఏపీ ప్రభుత్వం కూడా ఇదే విధంగా కసరత్తు చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన పోస్టుల కంటే అధిక సంఖ్యలో ప్రమోషన్లు పొందిన పోస్టుల వివరాలు తీసుకొని నివేదిక సమర్పించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సచివాలయంలోని అన్ని ప్యానెల్‌లు, ప్రమోషన్‌లను అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ నుండి ప్రభుత్వ అదనపు కార్యదర్శి వరకు అమలు చేయడానికి కసరత్తు చేస్తోంది.    

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)