Breaking News

ఆన్‌లైన్‌ అమ్మకాల్లో భారత్‌ దూకుడు

Published on Mon, 12/08/2025 - 04:32

సాక్షి, అమరావతి: ఆన్‌లైన్‌ అమ్మకాల్లో భారత్‌ దూసుకుపోతోంది. టెక్నాలజీ వినియోగంలో ముందుండే అమెరికాను దాటేసి భారతీయులు ఆన్‌­లైన్‌లో వారికి నచ్చిన వస్తువులను కొనే­స్తున్నారు. మ­న దేశంలో అత్యధికంగా అమ్మకాలు జరిగే ద­సరా–దీపావళి పండుగ సమయంలో జరిగిన అమ్మ­కాలు.. అమెరికాలో క్రిస్మస్‌ ముందు జరిగే బ్లాక్‌ ఫ్రైడే అమ్మకాలను మించిపోయాయని ఎస్‌బీఐ రీ­సె­ర్చ్‌ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ సంవత్సరం  పండుగల సీజన్‌లో రూ.1.24 ల­క్ష­ల కో­ట్ల విలువైన అమ్మకాలు జరిగినట్లు ఎస్‌బీఐ అంచ­నా వేసింది.

ఇది గతేడాది జరిగిన అమ్మకాలు రూ.94,­800 కంటే ఎక్కువ. పండుగల సీజన్‌కు ముందు కేంద్రప్రభుత్వం జీఎస్టీ రేట్లను సంస్కరించడం ఈ ఏడాది అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణంగా పేర్కొంది. ఇదే సమయంలో అమెరికాలో ఈ ఏడా­ది బ్లాక్‌ ఫ్రైడే అమ్మకాలు రూ.1,02,960 కోట్లు ఉంటాయని అంచనా వేసింది. 2024లో ఈ బ్లాక్‌ ఫ్రైడే అమ్మకాలు రూ.95,040 కోట్లుగా నమో­దయ్యాయి. అంటే భారత్‌లో ఈ ఏడాది పండుగ అమ్మ­కాల్లో 31 శాతం నమోదయితే అమెరికాలో మా­త్రం ఈ వృద్ధి 8.3 శాతానికి పరిమితమవుతుందని ఎస్‌బీఐ అంచనా వేసింది. అమెరికా ఆర్థి­కవ్య­వస్థ అంతంతమాత్రంగానే ఉండటంతో ఈ ఏడాది అమ్మ­కాల్లో అంత వృద్ధి నమోదు కాకపోవచ్చని పేర్కొంది.

ఎక్కువ ఎలక్ట్రానిక్‌ వస్తువులే 
దేశీయ ఆన్‌లైన్‌ అమ్మకాల్లో అత్యధికభాగం ఎలక్ట్రానిక్స్, హోమ్‌ అప్లయిన్సెస్‌ వస్తువులే అత్యధికంగా ఉంటున్నాయి. మొత్తం అమ్మ­కాల్లో 43 శాతం (సుమారు రూ.53 వేలకోట్లు) ఈ రెండు రంగాల్లోనే జరు­గుతు­న్నాయి. ఆ తర్వాత అత్యధికంగా మొబైల్‌ ఫోన్లు (26 శాతం) కొనుగోలు చేస్తున్నారు. తర్వాతి స్థానాల్లో లైఫ్‌స్టైల్‌ ఉత్పత్తులు (22 శాతం), సౌందర్యసాధనాలు (21 శాతం) ఉన్నాయి. ఈ సారి ఖరీదైన వస్తువులను మెట్రో వాసులే కాకుండా నాన్‌ మెట్రో వాసులు కూడా అత్యధికంగా కొనుగోలు చేసినట్లు  ఎస్‌బీఐ తెలిపింది. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)