Breaking News

ఏఐతో రోజుకు 55 నిమిషాలు ఆదా

Published on Mon, 09/15/2025 - 05:49

సాక్షి, అమరావతి: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) అందిపుచ్చుకుని వేగంగా పనులు పూర్తిచేయడంలో జెనరేషన్‌ జెడ్‌ (జెన్‌జెడ్‌– 1997–2012 మధ్య జన్మించినవారు) దూ­సు­కుపోతోంది. కేవలం ఏఐను వినియోగించుకోవడమే కాకుండా దీన్ని ఏ విధంగా వా­డు­కోవాలన్నదానిపై పాతతరం ఉద్యోగులకు నేర్పించడంలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాలు ఇంటర్నేషనల్‌ వర్క్‌ప్లేస్‌ గ్రూపు తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 

సమావేశాలకు సిద్ధం కావడం, ఈ–మెయిల్స్‌ పంపడం, ఫైళ్ల నిర్వహణ..  ఇలా రోజువారి ఆఫీసు కా­ర్యా­కలాపా­ల్లో ఏఐ టూల్స్‌ను జెన్‌జెడ్‌ వినియోగిస్తోంది. దీంతో సగటున రోజుకు 55 నిమిషాల సమయం ఆదా అవుతున్నట్లు సర్వే వెల్లడించింది. ఈ టూల్స్‌ వల్ల వారు ఒకసారి చేసిన పనిని తిరిగి చేయాల్సిన అవసరం లేకుండా కొత్త కార్యకలాపాలపై దృష్టిసారించడానికి వీ­లు­కలుగుతోందని తేలింది. 

అమెరికా, బ్రిటన్‌లలో రెండువేల మంది ఉద్యోగులపై నిర్వహించిన ఈసర్వేలో 86 శాతం మంది ఉద్యోగులు ఏఐతో చాలా ప్రయోజనం పొందుతున్నట్లు తెలిపారు. అంతేకాదు 76 శాతం మంది తమ పదోన్నతుల్లో ఏఐ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. అదే జెన్‌జెడ్‌లో అయితే 87 శాతం మంది పదోన్నతులు పొందడంలో ఏఐ కీలకపాత్ర పోషించిందని తెలిపారు.

ఏఐ వినియోగం తప్పనిసరి
రానున్న కాలంలో పనిచేసేచోట ఏఐ వినియోగం తప్పనిసరి కానుందని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. దీనికి అనుగుణంగా వ్యాపారసంస్థలు తమ విభాగాల్లో జెన్‌జెడ్‌ను ప్రోత్సహిస్తూ పాతతరం వారికి కొత్త టూల్స్‌పై అవగాహన కల్పించే విధంగా శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈ విధంగా హైబ్రీడ్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తున్నట్లు సర్వే వెల్లడించింది. ఏఐ టూల్స్‌ ద్వారా కొత్త వ్యాపార అవకాశాలు పెరుగుతున్నాయని 82 శాతం మంది పేర్కొన్నారు. 

ఇంటర్నేషనల్‌ వర్క్‌ప్లేస్‌ గ్రూపు సీఈవో మార్క్స్‌ డిక్సన్‌ మాట్లాడుతూ రోజువారి దైనందిన కార్యకలపాల్లో ఏఐ వినియోగం అన్నది తప్పనిసరి అవుతోందని, దీంతో వీటిని వినియోగించే జెన్‌జెడ్‌ యువతకు అవకాశాలు మరింత పెరుగుతున్నాయని చెప్పారు. పాతతరం కొత్తతరం కలిసి పనిచేయడం ద్వారా అధిక ఉత్పత్తిని పెంచవచ్చని 82 శాతం మంది అభిప్రాయపడినట్లు తెలిపారు. 

కొత్తతరం డిజిటల్‌ వినియోగిస్తుంటే దీనికి సీనియర్‌ ఉద్యోగుల వృత్తి అనుభవాన్ని జోడించడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందుతున్నట్లు చెప్పారు. కంపెనీలు తమ లాభాలను పెంచుకోవడానికి జెన్‌జెడ్‌తో కలిసి సీనియర్లు పనిచేసే విధంగా పనిసంస్కృతిని పెంచుకుంటున్నట్లు డిక్సన్‌ తెలిపారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)