Breaking News

కదిరిలో ‘దృశ్యం’ తరహా కేసు.. మిస్టరీ వీడింది

Published on Sat, 10/04/2025 - 19:22

తన కూతురితో పాటు తనపైనా కన్నేసిన ఓ మృగాన్ని భార్య కడతేరిస్తే.. ఆ మృతదేహాం ఆనవాలు కూడా దొరక్కుండా మాయం చేస్తాడు ఓ భర్త. అటుపై ఈ కేసులో కుటుంబాన్ని రక్షించుకునేందుకు అతగాడు చేసే ప్రయత్నాల ఆధారంగా అటు మలయాళం, ఇటు తెలుగు, మిగతా భాషల్లోనూ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ‘దృశ్యం’ సిరీస్‌ అలరిస్తూ వస్తోంది. తాజాగా ఒరిజినల్‌ లాంగ్వేజ్‌లో మూడో పార్ట్‌ షూటింగ్‌ కూడా మొదలైంది. అయితే.. 

ఈ సినిమా స్ఫూర్తితో చాలా నేరాలు జరగడమూ చూశాం. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోనూ ఈ తరహాలో జరిగిన ఓ నేరాన్ని పోలీసులు ఎట్టకేలకు చేధించగలిగారు. తన భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఓ వ్యక్తిని హత్య చేసి ఆ శవాన్ని కనపడకుండా చేశారు ఇక్కడ. వివరాల్లోకి వెళ్తే..  

అల్లుగుండుకు చెందిన అమర్నాథ్‌ మిస్సింగ్‌ కేసు రెండేళ్ల తర్వాత సాల్వ్‌ అయ్యింది. తన భర్త, అతని ఇద్దరు స్నేహితుల సాయంతో ఓ మహిళ అతన్ని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అమర్నాథ్‌ తనను అసభ్యంగా ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడనే ఆమె రగిలిపోయింది. విషయాన్ని తన భర్త దాదా పీర్‌కు చెప్పి వాపోయింది. దీంతో.. 

అమర్నాథ్‌పై కోపంతో రగిలిపోయిన దాదా పీర్‌.. స్నేహితులు సాధిక్‌, యాసిన్‌లతో కలిసి అమర్నాథ్‌ను హతమార్చాడు. ఆపై మృతదేహాన్ని చెర్లోపల్లి రిజర్వాయర్‌లో పడేశాడు. తాజాగా కేసు మిస్టరీని చేధించిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన అదనపు సమాచారం అందాల్సి ఉంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)