Breaking News

సోషల్‌ మీడియాలో... సంక్రాంతి సందడి    

Published on Mon, 01/06/2025 - 05:50

సోషల్‌ మీడియాలో వారం రోజులుగా ‘గోదారోళ్ల సంక్రాంతి’ మానియాగా మారింది. ‘సందళ్లే.. సందళ్లే.. సంక్రాంతి సందళ్లే.. అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్లే...’ పాట ఇప్పుడు సోషల్‌ మీడియా ఫాలోవర్స్‌ చెవుల్లో మార్మోగుతోంది. సంక్రాంతి పండుగ పూర్తయ్యేంత వరకూ ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్, యూట్యూబ్‌లలో గోదావరి జిల్లాల్లో జరిగే సంక్రాంతి పండుగ సందడి ట్రెండింగ్‌లో నిలవనుంది. రీల్స్, పోస్టింగ్స్‌లో సంక్రాంతి పండుగను హోరెత్తిస్తున్నారు. 

ఫేస్‌బుక్, ఇన్‌స్టాలలో ఏ రీల్స్‌ చూసినా ‘గోదావరి జిల్లాలకు పోదాం.. సంక్రాంతి చూద్దాం’ అనే క్యాంపెయిన్‌ ఎక్కువగా జరుగుతోంది. పండుగ సమీపిస్తున్న కొద్దీ ‘మరో పది రోజులు... మరో తొమ్మిది రోజులు...’ అంటూ కౌంట్‌ డౌన్‌ రీల్స్‌ కూడా చేస్తున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ మూడు రోజులు జరిగే విశేషాలు, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రభల తీర్థాలు, వంటకాలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.  – సాక్షి, అమలాపురం

దేశ, విదేశాల నుంచి రాక... 
సంక్రాంతి పండుగను గోదావరి జిల్లాల్లో ప్రత్యేకంగా జరుపుకొంటారు. అందుకే ఉపాధి, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు పెద్ద పండుగ జరుపుకొనేందుకు రెక్కలు కట్టుకుని ఇక్కడ వాలిపోతున్నారు. వీరితోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రలకు చెందిన వారు కూడా ఈ పండుగకు అతిథులుగా వస్తారు.

విదేశాల్లో ఉపాధి పొందుతున్న వారు సైతం పండుగ సమయానికి ఇక్కడికి వచ్చేలా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. సంక్రాంతి పండుగ దగ్గర పడుతున్న సమయంలో సోషల్‌ మీడియాలో పండుగ జోష్‌ మరింత పెరిగింది.  

రకరకాల రీల్స్‌ హల్‌చల్‌ 
సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాలో జరిగే ప్రతి కార్యక్రమంపై ఇప్పుడు సోషల్‌ మీడియాలో రీల్స్‌ చేస్తున్నారు. ఇళ్లల్లో పిండి వంటలు.. ఇళ్ల ముందు రంగవల్లులు... వీధుల్లో గంగిరెద్దులు, హరిదాసుల సందళ్లు.. భోగి మంటలు... పిల్లలకు పోసే భోగి పళ్లు.. పట్టు పరికిణిల్లో పడుచు పిల్లల సందడి.. గోవు పిడకలు... ప్రభల తీర్థాలు... అమ్మవారి ఆలయాల వద్ద మొక్కులు తీర్చుకోవడం... ఇలా ప్రతి ఒక్కటీ రీల్స్‌గా మారి సోషల్‌ మీడియాను ముంచెత్తున్నాయి. 

కోడిపందేలు.. గుండాట.. వంటి జూద క్రీడలు, రికార్డింగ్‌ డ్యాన్సులు సైతం రీల్స్‌గా మారిపోతున్నాయి. రీల్స్‌కు తగిన విధంగా తెలుగు సినిమా పాటలు.. హాస్యనటులతో గోదావరి జిల్లాల సంక్రాంతి మీమ్స్‌ కూడా నవ్వులు పూయిస్తున్నాయి.  

ఇతర దేశాల్లో సైతం.. 
ఇతర దేశాల్లో సైతం సంక్రాంతి సందడి మొదలైంది. గోదారోళ్లు యూకే టీం ‘గోదారోళ్ల సంక్రాంతి సంబరాలు–2025’ పేరుతో వెబ్‌ పేజీ డిజైన్‌ చేసింది. సంక్రాంతి పండుగ ఇక ఎన్ని రోజులు.. ఎన్ని గంటలు.. ఎన్ని నిమిషాలు... అంటూ కౌంట్‌డౌన్‌ మొదలు పెట్టారు. సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఆహ్వాన పత్రికలను కూడా ముద్రించారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)