Breaking News

పారిశుద్ధ్య కార్మికుల కన్నెర్ర

Published on Sun, 12/14/2025 - 04:15

అనంతపురం (మెడికల్‌): అనంతపురం సర్వజనాస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికులు కన్నెర్ర చేశారు. ఏళ్లుగా పనిచేస్తున్న తమను ఇంటికి సాగనంపి కొత్త వారిని విధుల్లోకి తీసుకునేందుకు యత్నించిన ఏజెన్సీ నిర్వాకాన్ని నిరసిస్తూ శనివారం ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. సర్వజనాస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికులను వయసు నిబంధన పేరిట ‘పద్మావతి ఏజెన్సీ’ విధుల నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. 

ఈ క్రమంలోనే ఏజెన్సీ నిర్వాహకుల దురుసు ప్రవర్తనతో మనస్తాపం చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు పద్మావతి శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో శనివారం పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ తదితర సంఘాలు వీరి ఆందోళనకు మద్దతుగా పాల్గొన్నాయి. 

ఆందోళన కొనసాగుతున్న సమయంలోనే పద్మావతి ఏజెన్సీ నిర్వాహకులు కొత్తగా పదుల సంఖ్యలో డైలీ వేజెస్‌ కింద సిబ్బందిని గుట్టుగా తీసుకువచ్చి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని చూశారు. దీనిపై కార్మికులు కన్నెర్ర చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కేఎల్‌ సుబ్రహ్మణ్యం, ఆర్‌ఎంఓ డాక్టర్‌ హేమలత సమక్షంలోనే ఏజెన్సీ మేనేజర్లు హరి, సాయితేజారెడ్డితో వాగ్వాదానికి దిగారు. వివిధ వార్డుల్లో పనిచేస్తున్న ప్రైవేట్‌ సిబ్బందిని కార్మికులు అడ్డుకుని, తోసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. 

ఆందోళనలు చేపట్టి, దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రీనివాసరావు కార్మిక సంఘాల నాయకులను హెచ్చరించారు. ఆస్పత్రికి వచ్చిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను పారిశుద్ధ్య కార్మికులు చుట్టుముట్టారు. తమను అన్యాయంగా తొలగిస్తున్నారని వాపోయారు. సమస్యను మంత్రి నారా లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు.  

కార్మికులకు అన్యాయం జరిగితే ఊరుకోం 
కోవిడ్‌ పరిస్థితుల్లోనూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనులు చేసిన పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి మండిపడ్డారు. వయసు పేరిట కార్మికులను తొలగించాలని చూస్తే ఊరుకోబోమన్నారు. సీఐటీయూ నేత నాగేంద్ర మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మిత్రుడు భాస్కర్‌ నాయుడుకు చెందిన పద్మావతి ఏజెన్సీ దౌర్జన్యం, దాష్టీకానికి కార్మికులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి, వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు కొర్రపాడు హుస్సేన్‌ పీరా, రాజారెడ్డి, అనిల్‌కుమార్‌గౌడ్, కాకర్ల శ్రీనివాస్‌రెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి, మహ్మద్‌ హుస్సేన్, వామపక్ష నాయకులు రామిరెడ్డి, సురేష్, యేసురత్నం, ఏటీఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)