Breaking News

ఇసుక ధర పెంపు.. కొనుగోలుదారుల నిరసన

Published on Thu, 08/01/2024 - 05:57

భీమునిపట్నం/అగనంపూడి (విశాఖ): ఒక పక్క ప్రభుత్వం ఇసుక ఉచితమని ప్రకటనలు గుప్పిస్తూ.. మరోవైపు భారీ మొత్తంలో వసూలు చేస్తుండటంపై ఇప్ప టికే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర అసంతృప్తి వ్యక్త మవుతోంది. అయినా రేటు రోజురోజుకు పెంచేస్తున్నారు. బుధ­వారం భీమిలి ర్యాంపు వద్ద ఒక్కసారిగా టన్ను­కు రూ.318 పెంచడంతో వినియోగదారులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. జిల్లా­వ్యాప్తంగా ఒకటే ధర ఉండాలని ప్రభుత్వం ఆదేశించడంతో కలెక్టర్‌ సారథ్యంలోని కమిటీ ధరలను సమీక్షించింది. 

అగనంపూడి, భీమిలి డిపోల్లో టన్ను రూ.1,076 కు విక్రయించాలని నిర్ణయించింది. దీంతో భీమిలి వద్ద ధర పెరగ్గా, అగనంపూడి డిపోలో అంతే స్థాయిలో ధర తగ్గింది. భీమిలి వద్ద మంగళవారం టన్ను రూ.758కి ఇవ్వగా, బుధవారం ఒక్కసారిగా రూ. 1076కు పెరగడంతో కొనుగోలుదారులు నిరసనకు దిగారు. ఉచిత ఇసుకపేరుతో ఒక్కో వ్యక్తికి ఆధార్‌ కార్డుపై రోజుకు 20 టన్నులు ఇస్తున్నారు. రవాణా ఖర్చులు కొనుగోలుదారులే భరించాలి. దీంతో ఇసుక భారం మోయలేనంతగా పెరిగింది. 

ఉచితమని ప్రకటించి ప్రభుత్వం ఇలా డబ్బులు వసూలు చేస్తున్నా గత్యంతరం లేక విశాఖ, విజయనగరం జిల్లాల్లోని పలు ప్రాంతాల వారు భీమిలి వద్ద ఇసుక కొంటున్నారు. ఒక్కసారిగా ధర పెరగడంతో వారంతా షాక్‌ తిన్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఎలా పెంచేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి లారీలు తెచ్చామని, ఇప్పుడు పెరిగిన రేటుకు ఇసుకను కొనలేక ఖాళీ లారీలతో వెనక్కి వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచితమన్న పేరుతో ఇలా దోచేస్తే ఇళ్లెలా కట్టుకొంటామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన ధరను తగ్గించి ఇసుకను అందివ్వాలని డిమాండ్‌ చేశారు.

ఒక్కసారిగా పెంచేస్తే ఎలా కొనగలం?
ఇసుక ధరను ఇలా పెంచుతారని ఎవరూ ఊహించలేదు. ఉదయం ర్యాంపు వద్దకు లారీలు తీసుకొస్తే... రేటు పెంచినట్టు తెలిపారు. టన్నుకు రూ.300 పైనే పెంచేశారు. ఉచితమని చెబుతూ ఇలా రేటు ఒక్కసారిగా పెంచేస్తే తట్టుకునే పరిస్థితి లేదు. – తుపాకుల సురేష్, మజ్జివలస

ఉచితమని ప్రకటించడం ఎందుకు?
ఇసుక ధర ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నట్టు ప్రకటించడం ఎందుకు? కనీసం పాత ధరకు కూడా ఇవ్వకుండా కొద్ది రోజుల్లోనే ధర ఇలా పెంచేయడం పద్ధతి కాదు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది? – జి.శ్రీను, ఆనందపురం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)