Breaking News

మంత్రి ఇలాకాలో అడ్డగోలుగా ఇసుక దందా

Published on Sat, 11/02/2024 - 04:56

పెనుకొండ: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. నియోజకవర్గం పరిధిలోని పెన్నా నదితో పాటు వాగులు, వంకల్లోని ఇసుకను టీడీపీ నేతలు కొల్లగొడుతున్నారు. నిత్యం ట్రాక్టర్ల­లో సమీప పట్టణాలకు, కర్ణాటకలోని ప్రాంతాలకు అక్ర­మ రవాణా చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటు­న్నారు. వీరు ఎక్కడపడితే అక్కడ ఇసుక తవ్వే­యడం వల్ల బోర్లు ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

టీడీపీ, జనసేన నాయకు­లు పలువురు నియోజకవర్గంలోని శెట్టిపల్లి, కొండంపల్లి, గోనిపేట, రొద్దం, పరిగి వద్ద పెన్నా నది నుంచి ఇసుక భారీగా తోడేస్తున్నారు. ట్రాక్టర్‌ ఇసుకను నియోజవర్గ పరిధిలో వారికి రూ.2 వేల నుంచి రూ.2,500కు విక్రయిస్తున్నారు. కర్ణాటక ప్రాంతాల­కు లోడుకు రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. వీరి అక్రమ రవాణాను పోలీసులు, రెవెన్యూ అధికా­రులు పట్టించుకోవడం లేదు. 

ఎక్కడైనా పోలీస్‌ సిబ్బంది ఇసుక ట్రాక్టర్లను పట్టుకుంటే డబ్బు బెదిరించి విడిపించుకొని పోతున్నారు. ఇసుక తోలుకోమని మంత్రే చెప్పారని, అడ్డుకుంటే మీ కథ చూస్తామంటూ బెది­రిస్తు­న్నారు. అయినా ట్రాక్టర్లను పోలీసుస్టేషన్‌కు తరలిస్తే పెద్దఎత్తున కూటమి నాయకులు అక్కడికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. రెవెన్యూ అధికారులు ఇసుక వ్యవహారంలో తలదూర్చడమే లేదు.

బోర్లు ఎండిపోతాయి
కొందరు నాయకులు రోజూ ఎక్కడపడితే అక్కడ ఇసుక తవ్వేసి, తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇది వ్యవసాయాన్ని దెబ్బ తీస్తుంది. ఇసుక రీచ్‌ల సమీపంలోని భూగర్భజలాలు అడుగంటి బోర్లు ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇసుక అవసరం ఉన్న వారు తగిన అనుమతి పొంది తోలుకుంటే మంచిదే. కానీ ఇది వ్యాపారంగా మారిపోయింది. శెట్టిపల్లి, కొండంపల్లి, గోనిపేట ప్రాంతాల నుంచి ఇసుక భారీగా తరలివెళుతోంది. వంకలు, వాగులు కూడా త్వరలోనే ఖాళీ కానున్నాయి.    – గోపాలరెడ్డి, కొండంపల్లి, పెనుకొండ మండలం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)