Breaking News

స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం కక్ష సాధింపు.. ఉద్యోగుల ఆవేదన

Published on Sun, 12/15/2024 - 09:43

సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోంది. ఉద్యోగుల జీతాల విషయంలో స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం దారుణంగా వ్యవహరిస్తోంది. ఈనెల 15వ తేదీ వచ్చినా కార్మికులకు ఇంకా జీతాలు అందలేదు. ఇక, గత రెండు నెలలుగా వారికి కేవలం సగం కన్నా తక్కువ జీతాలే ఇస్తున్నారు.

విశాఖ ఉక్కు కార్మికులకు జీతాలు ఇంకా అందలేదు. డిసెంబర్‌ నెలకు సంబంధించిన 15వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగుల విషయంలో యాజమాన్యం దారుణంగా వ్యవహరిస్తోంది. అక్టోబర్ నెలలో 50 శాతం, సెప్టెంబర్ నెల జీతం 35 శాతం మాత్రమే యాజమాన్యం చెల్లించింది. ఇప్పటికే పెండింగ్ జీతాలపై యాజమాన్యం ఊసే ఎత్తకపోవడం గమనార్హం​.

ఈ సందర్బంగా ఉక్కు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ ఎదుర్కోలేదని ఉక్కు కార్మికులు చెబుతున్నారు. యాజమాన్యం ధోరణికి వ్యతిరేకంగా.. జీతాల విషయమై ఈనెల 18న కుటుంబాలతో సహా ఆందోళన చేసేందుకు సమాయత్తం అవుతున్నట్టు కార్మికులు తెలిపారు. ఇక, కార్మికుల ప్రకటనపై కూటమి ప్రభుత్వం కనీసం స్పందించలేదు. దీనిపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కార్‌ తమకు మద్దతుగా నిలవాలని వ్యాఖ్యలు చేశారు. 

 


 

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)