Breaking News

దేశంలో అత్యధిక సర్క్యులేషన్‌ ఉన్న పత్రికల్లో ఎనిమిదో స్థానంలో ‘సాక్షి’

Published on Sat, 11/16/2024 - 04:46

సాక్షి, అమరావతి: ‘సత్యమేవ జయతే’ నినాదంతో తెలుగు నేలపై 2008 మార్చి 23వతేదీన ప్రారంభమైన ‘సాక్షి’ పత్రిక ప్రస్థానం దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లుతోంది. ఉన్నది ఉన్నట్టుగా.. నాణానికి రెండో వైపు వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న ‘సాక్షి’ అశేష పాఠకాదరణతో తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తోంది. 

ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్‌ (ఏబీసీ) ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకూ నిర్వహించిన ఆడిటింగ్‌లో నిత్యం 12,47,492 కాపీలతో (15,480 వేరియంట్‌ సహా) దేశంలో అత్యధిక సర్క్యు­లేషన్‌ కలిగిన దిన పత్రికల్లో ‘సాక్షి’ ఎనిమిదో స్థానంలో నిలిచింది.

ఆంధ్రప్రదేశ్‌లో 8,66,582, తెలంగాణలో 3,71,947, బెంగళూరు, చెన్నై, ముంబై, న్యూఢిల్లీ మెట్రో ఎడిషన్లలో 8,963 సర్క్యు­లేషన్‌తో ‘సాక్షి’ పాఠకాదరణలో దూసుకెళ్తు­న్నట్లు ఏబీసీ వెల్లడించింది. 



తొలి మూడు స్థానాల్లో హిందీ పత్రికలు
తాజాగా ఏబీసీ నిర్వహించిన ఆడిటింగ్‌లో హిందీ పత్రికలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. దైనిక్‌ భాస్కర్‌ (హిందీ) పత్రిక 30,73,304 సర్క్యులేషన్‌తో అగ్రస్థానంలో నిలిచింది. 24,42,728 సర్క్యులేషన్‌తో దైనిక్‌ జాగరణ్‌ (హిందీ) రెండో స్థానంలో నిలవగా.. అమర్‌ ఉజాలా (హిందీ) 17,05,529 సర్క్యులేషన్‌తో మూడో స్థానంలో ఉంది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా (ఇంగ్లీష్‌) నాలుగో స్థానంలో నిలిచింది.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)